ఖతార్ లో క్లాస్‌రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!

- February 04, 2026 , by Maagulf
ఖతార్ లో క్లాస్‌రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!

దోహా: స్టూడెంట్స్ లో రీడింగ్ అలవాట్లను ప్రోత్సహించడం మరియు పుస్తకాల విలువను పునరుద్ధరించడం లక్ష్యంగా ఖతార్ ఛారిటీ (QC) ‘క్లాస్‌రూమ్ రీడింగ్ బ్యాగ్ ఫర్ ఫ్యామిలీ రీడింగ్’ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. విద్యా మంత్రిత్వ శాఖతో భాగస్వామ్యంతో అమలు చేయబడిన ఈ ప్రాజెక్ట్ బలమైన సాంస్కృతిక మరియు సామాజిక కోణాలతో కూడిన విద్యా చొరవను అందిస్తుంది.  ఈ ప్రాజెక్ట్ విద్యా మంత్రిత్వ శాఖ సమన్వయంతో నిపుణులు ఎంపిక చేసిన విభిన్న పుస్తకాలను ఈ ప్రాజెక్టు కింద పంపిణీ చేస్తున్నారు. ప్రతి బ్యాగ్‌ను ఒక వారం పాటు ఒక విద్యార్థికి కుటుంబ సభ్యులతో కలిసి చదవడానికి అందజేస్తారు. తర్వాత దానిని తరగతి గదికి తిరిగి పంపి, ఇతర విద్యార్థులకు అందజేస్తారు.

మొదటి దశలో దేశవ్యాప్తంగా 5,000 పాఠశాలల్లో 3,743 ప్రాథమిక పాఠశాల స్టూడెంట్స్ కు  సుమారు 2,800 విభిన్న పుస్తకాలతో కూడిన 11,229 రీడింగ్ బ్యాగులను పంపిణీ చేసినట్టు  డైరెక్టర్ కరిమా బౌసల్మి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com