సౌదీలో ఎండల తీవ్రత.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు..!!
- August 06, 2026
జెడ్డా: సౌదీ అరేబియాలో ఎండల తీవ్రత కొనసాగనున్నట్లు జాతీయ వాతావరణ కేంద్రం (NCM) వెల్లడించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 49 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. తూర్పు ప్రావిన్స్‌తో పాటు రియాద్, మక్కా, మదీనా, నజ్రాన్ ప్రాంతాల్లో తీవ్రమైన వేడి వాతావరణం కొనసాగనుంది.
దమ్మామ్‌లో అత్యధికంగా 49 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, రియాద్, మక్కాల్లో 46, మదీనాలో 47, బురైదాలో 45, హైల్‌లో 42, తబుక్, నజ్రాన్‌లో 41, అరార్‌లో 44, సకాకాలో 43 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
వాతావరణ పరిస్థితుల పరంగా చూస్తే.. రియాద్, మక్కా, మదీనా, బురైదా, హైల్, నజ్రాన్ ప్రాంతాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండనుంది. జెడ్డాలో బలమైన గాలులు, దుమ్ముతో కూడిన వాతావరణం ఉండనుండగా, దమ్మామ్‌లో దుమ్ము గాలులు వీచే అవకాశం ఉంది. అభా ప్రాంతంలో దుమ్ము గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్-బాహా లో కూడా చెదురుమదురు వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉండగా, జజాన్ లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, దుమ్ము గాలులు వీచే అవకాశముందని ఎన్‌సీఎం తెలిపింది.
తాజా వార్తలు
- ఓపెన్ ప్రిజన్స్ ప్రోగ్రామ్.. ఖైదీల కళల్లో శాంతి సందేశాలు..!!
- యూఎన్ఓలో ఖతార్ అమిర్ ప్రసంగానికి దౌత్యవేత్తల ప్రశంసలు..!!
- ముత్రా కేబుల్ కార్ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష..!!
- ఇంట్లోకి చొరబడి కాల్పులు, 11 మంది మృతి
- ఆసియా-పసిఫిక్‌లో ఏరో ఇంజిన్ సేవల విస్తరణకు జీఎంఆర్ ఏరో టెక్నిక్–స్టాండర్డ్ ఏరో భాగస్వామ్యం
- యూపీఐ ఛార్జీలపై NPCI కీలక ప్రకటన
- దుబాయ్‌లో పెయిడ్ కార్ లిఫ్ట్‌లపై ఆర్టీఏ హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా
- దుబాయ్‌లో ఇళ్ల కొనుగోలుపై UBS ఆసక్తికర నివేదిక..!!
- కువైట్‌లో అత్యవసర ప్రణాళికలపై ఫైర్‌ఫోర్స్ సమీక్ష..!!
- ఖతార్‌లో డ్రైవింగ్ లైసెన్స్: అర్హతలు, నిబంధనలు, ఫీజుల పూర్తి వివరాలు..!!







