జీసీసీ-యూరప్ పార్లమెంటరీ సమావేశం.. ప్రాంతీయ భద్రతపై ఆందోళన..!!
- August 06, 2026
మనామా: ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు గల్ఫ్ సహకార మండలి (GCC), యూరోపియన్ పార్లమెంట్ దేశాలు ఉమ్మడి వైఖరితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని బహ్రెయిన్ పార్లమెంటరీ ప్రతినిధి బృందం పేర్కొంది. ఎంపీ అహ్మద్ సబాహ్ అల్ సల్లూమ్ నేతృత్వంలోని బృందం వర్చువల్‌గా నిర్వహించిన 10వ జీసీసీ-యూరోపియన్ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో పాల్గొంది.
ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతను శాంతియుత దౌత్య పరిష్కారాల ద్వారా బలోపేతం చేయాలన్న బహ్రెయిన్ వైఖరిని ప్రతినిధి బృందం పునరుద్ఘాటించింది. ఇటీవల ప్రాంతీయ మౌలిక వసతులపై ఇరాన్ జరిపిన దాడులు ప్రాంతీయ స్థిరత్వం, అంతర్జాతీయ సముద్ర భద్రత, ప్రపంచ ఇంధన మార్కెట్లకు తీవ్ర ముప్పుగా మారాయని పేర్కొంది. ఈ సమావేశంలో జీసీసీ శాసన మండళ్లు, యూరోపియన్ పార్లమెంట్ మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో 40,660 కిలోల ఫుడ్ ధ్వంసం..!!
- యూఏఈలో డీప్‌ఫేక్ మోసాలపై మహ్రె హెచ్చరిక..!!
- దుక్మ్ ప్రత్యేక ఆర్థిక మండలిలో OMR8.8 బిలియన్లకు పెట్టుబడులు..!!
- దోహాలో 22వ జ్యువెలరీ అండ్ వాచెస్ ఎగ్జిబిషన్‌కు సన్నాహాలు..!!
- సౌదీలో మరో 6 డ్రైవింగ్ స్కూల్స్..!!
- ఏపీలో 4 కొత్త పోలీస్ కమిషనరేట్లు.. కేబినెట్ ఆమోదం..!
- ఖోర్‌ఫక్కాన్ పోర్టును సందర్శించిన భారత కాన్సుల్ జనరల్ డా. విష్ణువర్ధన్ రెడ్డి
- UNGAలో జైశంకర్ వరుస భేటీలు.. AI, అంతరిక్షం, UNSC సంస్కరణల పై చర్చలు
- సౌదీలో తెలుగు ప్రవాసులది ప్రత్యేక ఉత్సాహం..భారత రాయబారి విపుల్
- ఖైరతాబాద్ బడా గణేష్‌ను దర్శించుకున్న డీజీపీ సీవీ ఆనంద్







