యూఏఈలో కొత్త విద్యాసంవత్సరానికి భారీగా పెరిగిన ఖర్చులు..!!
- August 06, 2026
దుబాయ్: యూఏఈలో పాఠశాలలు ఆగస్టు చివరి వారంలో తిరిగి ప్రారంభం కానుండటంతో తల్లిదండ్రులు కొత్త విద్యాసంవత్సరానికి ఆర్థిక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ట్యూషన్ ఫీజులు, యూనిఫాంలు, పుస్తకాలు, స్టేషనరీ, రవాణా, సహపాఠ్య కార్యకలాపాల ఖర్చులతో ప్రతి కుటుంబంపై అదనపు ఆర్థిక భారం పడనుందని నిపుణులు చెబుతున్నారు.
స్కైబౌండ్ వెల్త్ మేనేజ్మెంట్ సీఈఓ మైక్ కోడీ మాట్లాడుతూ.. పాఠశాల ఖర్చుల కోసం ముందుగానే ప్రత్యేక ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్, ట్యూషన్ ఫీజులు, రవాణా, యూనిఫాంలు, పుస్తకాలు, డిజిటల్ పరికరాలు, స్కూల్ ట్రిప్‌లు వంటి అన్ని ఖర్చులను ముందుగానే లెక్కించి, ప్రతి నెల ప్రత్యేక ఖాతాలో డబ్బు జమ చేస్తే చివరి నిమిషంలో ఇబ్బందులు తలెత్తవని చెప్పారు.
పాఠశాల ఫీజులు ఎంత?
యూఏఈలో పాఠశాలల వారీగా వార్షిక ట్యూషన్ ఫీజులు భారీగా మారుతూ ఉంటాయి.
* బడ్జెట్ పాఠశాలలు: సంవత్సరానికి 4,100 నుంచి 30,000 దిర్హమ్లు
* మధ్యస్థాయి పాఠశాలలు: 35,000 నుంచి 60,000 దిర్హమ్లు
* ప్రీమియం పాఠశాలలు:55,000 నుంచి 95,000 దిర్హమ్లకు పైగా, కొన్ని అంతర్జాతీయ పాఠశాలల్లో 1.43 లక్షల దిర్హమ్ల వరకు ఫీజులు ఉన్నాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, మొదటి ఏడాది ఫీజును మాత్రమే కాకుండా, భవిష్యత్‌లో ప్రతి ఏడాది పెరిగే ఫీజులను కూడా దృష్టిలో పెట్టుకుని పాఠశాలను ఎంపిక చేసుకోవాలి.
అదనపు ఖర్చులు కూడా భారీగానే
ట్యూషన్ ఫీజులతో పాటు ఒక్కో విద్యార్థిపై 2,000 నుంచి 10,000 దిర్హమ్ల వరకు అదనపు ఖర్చు వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
యూనిఫాంలు: ఒక్కో విద్యార్థికి 600 నుంచి 2,000 దిర్హమ్లు. కొన్ని పాఠశాలల్లో స్పోర్ట్స్ కిట్లు, బ్లేజర్లు, షూలతో కలిపి ఈ ఖర్చు 5,000 దిర్హమ్ల వరకు చేరుతోంది.
పుస్తకాలు, స్టేషనరీ, డిజిటల్ పరికరాలు: 1,500 నుంచి 4,000 దిర్హమ్లు అవుతుంది. సెకండరీ విద్యార్థులకు పుస్తకాల సెట్ మాత్రమే 1,200 దిర్హమ్ల వరకు ఉండొచ్చు. బ్యాగులు, స్టేషనరీతో పాటు కొన్ని పాఠశాలలు ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్ తప్పనిసరి చేస్తున్నాయి.
లంచ్ బాక్స్, వాటర్ బాటిల్: 150 నుంచి 500 దిర్హమ్లు.
సహపాఠ్య కార్యక్రమాలు (ECAలు): సంవత్సరానికి 1,000 నుంచి 8,000 దిర్హమ్లకు పైగా ఖర్చవుతుంది. క్రీడలు, రోబోటిక్స్, సంగీతం, ప్రదర్శన కళల వంటి ప్రత్యేక కార్యక్రమాలకు అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారు.
ఖర్చులను ఎలా నియంత్రించాలి?
నిపుణులు తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. స్కూల్ ఖర్చుల కోసం ప్రత్యేక బడ్జెట్ రూపొందించుకోవడం, అత్యవసర నిధులను స్కూల్ ఫీజుల కోసం వినియోగించకపోవడం, వార్షిక చెల్లింపులపై లభించే డిస్కౌంట్లను ఉపయోగించుకోవడం, వడ్డీ లేని వాయిదా పద్ధతులను పరిశీలించడం, క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డులను జాగ్రత్తగా వినియోగించడం మంచిదని సూచించారు. అలాగే, దుబాయ్ సమ్మర్ సర్ప్రైజెస్ వంటి సీజనల్ ఆఫర్లలో యూనిఫాంలు, స్టేషనరీ, స్కూల్ సామగ్రిని ముందుగానే కొనుగోలు చేస్తే ఖర్చులు తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు.
పిల్లల విద్య చాలా ముఖ్యమే. అయితే ఆ ఖర్చుల కోసం అత్యవసర నిధులను ఖాళీ చేయడం లేదా భవిష్యత్ పొదుపులను ఆపేయడం సరైన నిర్ణయం కాదు. ముందస్తు ప్రణాళికతో ఖర్చులను నియంత్రించుకోవాలి అని మైక్ కోడీ సూచించారు.
తాజా వార్తలు
- ఇంట్లోకి చొరబడి కాల్పులు, 11 మంది మృతి
- ఆసియా-పసిఫిక్‌లో ఏరో ఇంజిన్ సేవల విస్తరణకు జీఎంఆర్ ఏరో టెక్నిక్–స్టాండర్డ్ ఏరో భాగస్వామ్యం
- యూపీఐ ఛార్జీలపై NPCI కీలక ప్రకటన
- దుబాయ్‌లో పెయిడ్ కార్ లిఫ్ట్‌లపై ఆర్టీఏ హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా
- దుబాయ్‌లో ఇళ్ల కొనుగోలుపై UBS ఆసక్తికర నివేదిక..!!
- కువైట్‌లో అత్యవసర ప్రణాళికలపై ఫైర్‌ఫోర్స్ సమీక్ష..!!
- ఖతార్‌లో డ్రైవింగ్ లైసెన్స్: అర్హతలు, నిబంధనలు, ఫీజుల పూర్తి వివరాలు..!!
- ప్రపంచ ముస్లింల మనోభావాలను హౌతీ దెబ్బతీస్తోంది..!!
- హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ..ఫ్రాన్స్‌తో జీసీసీ కీలక చర్చలు..!!
- మస్కట్‌లో రోడ్ల అభివృద్ధికి భారీగా పనులు..భద్రత బలోపేతం..!!







