నా కూతురే అదృష్టాన్ని తెచ్చింది: dh20 మిలియన్ విజేత..!!
- February 05, 2026
యూఏఈ: 34 ఏళ్ల శాంతను శెట్టిగర్, డిసెంబర్ 27న బేబి గర్ల్ కు స్వాగతం పలికాడు. ఈ శుభవార్త వచ్చిన కొన్ని వారాలకే, అతనికి మరో శుభవార్త అందింది. అతను 20 మిలియన్ దిర్హమ్‌ల బిగ్ టికెట్ జాక్‌పాట్‌ను గెలుచుకున్నాడు. ఈ సమయం నమ్మశక్యంగా అనిపించడం లేదు అని శాంతను అన్నారు. తన కూతురే తనకు అదృష్టాన్ని తెచ్చిందని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నాడు. దీనిని తాను అస్సలు ఊహించలేదని తెలిపాడు. తనకు లక్కును తెచ్చిన తన కూతురిని ఇంకా నేరుగా చూడలేదని, త్వరలోనే ఇండియాకు వెళతానని పేర్కొన్నాడు.
కర్ణాటకలోని ఉడిపికి చెందిన శాంతను, మస్కట్‌లో ఒక షాప్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్నాడు. అక్కడ అతను గత ఎనిమిది సంవత్సరాలుగా నివసిస్తున్నాడు. అతను పనిలో బిజీగా ఉన్నందున బిగ్ టికెట్ డ్రాను ప్రత్యక్షంగా చూడలేదు. షో నిర్వాహకులు అతనికి ఫోన్ చేసినప్పుడు, అతను మొదటి రెండు కాల్స్‌ను మిస్ అయ్యాడు. మూడోసారి ఫోన్ కాల్ కు అటెండ్ అయ్యాయని, మొదట అది నిజమని తాను అనుకోలేదని తెలిపాడు.
శాంతను సుమారు ఐదేళ్లుగా బిగ్ టికెట్‌లో పాల్గొంటున్నాడు. కానీ గత మూడు సంవత్సరాలుగా రెగ్యులర్ ప్రతి డ్రాలో పాల్గొంటున్నట్లు తెలిపాడు. డబ్బు గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని, సమయం తీసుకొని బాగా ఆలోచించి, ప్రణాళిక వేసుకుంటానని తెలిపాడు. అయితే, తన కుటుంబాన్ని మస్కట్‌కు తీసుకువచ్చి కలిసి జీవించాలని ప్లాన్ చేస్తున్నట్టు చెప్పాడు.
తాజా వార్తలు
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!







