ట్యాక్స్ రిటర్న్స్‌ను ఆగస్ట్ 31 వరకు దాఖల గడువు పొడిగింపు ..

- July 29, 2016 , by Maagulf
ట్యాక్స్ రిటర్న్స్‌ను ఆగస్ట్ 31 వరకు దాఖల గడువు పొడిగింపు ..

కేంద్ర ప్రభుత్వం ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు గడువును ఆగస్ట్ 5 వరకు పొడిగించింది. పన్ను చెల్లింపుదారులు 2015-16 (2016-17 అసెస్‌మెంట్ ఏడాది)కు సంబంధించిన ట్యాక్స్ రిటర్న్స్‌ను జూలై 31 లోగా దాఖలు చేయాలి. కానీ ప్రభుత్వ రంగ బ్యాంకుల ఒక రోజు సమ్మె కారణంగా ట్యాక్స్ రిటర్న్స్ గడువును ఆగస్ట్ 5 వరకు పొడిగిస్తున్నట్లు రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అదియా తెలిపారు. ఇక జమ్మూకశ్మీర్‌లో పన్ను చెల్లింపుదారులు వారి ట్యాక్స్ రిటర్న్స్‌ను ఆగస్ట్ 31 వరకు దాఖలు చేయవచ్చని పేర్కొన్నారు.7 లక్షల అసెసీలకు ఐటీ విభాగం లేఖలు హైదరాబాద్: పన్ను ఎగవేతలను అరికట్టే దిశగా అధిక విలువ లావాదేవీలు జరిపిన వారి పాన్ నంబరు వివరాలను సేకరించడంపై ఆదాయ పన్ను విభాగం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈ తరహా లావాదేవీలు నిర్వహించిన 7 లక్షల మంది అసెసీలకు .. పాన్ నంబరు సమర్పించాలంటూ లేఖలు పంపనుంది. ఈ వివరాలు సమర్పించేందుకు సదరు అసెసీల సౌకర్యార్థం కొత్తగా ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌ను కూడా ప్రవేశపెట్టినట్లు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com