BJP మేనిఫెస్టో విడుదల చేసిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు

- February 06, 2026 , by Maagulf
BJP మేనిఫెస్టో విడుదల చేసిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు

హైదరాబాద్: తెలంగాణలో(TG) త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. మున్సిపాలిటీ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా కమలం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రాంచందర్ రావు మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోను అధికారికంగా విడుదల చేశారు.ప్రధాన అంశాల్లో కోతులు, కుక్కల బెడద నివారణను చేర్చారు.

పన్నుల పెంపు లేదు, వారం రోజుల్లో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు, బస్తీ దవాఖానలు, స్మార్ట్ సిటీలుగా అభివృద్ది, క్లీన్ సిటీ, గ్రీన్ టౌన్. 100 శాతం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ , దేవాలయాల రక్షణ, మహిళల రక్షణ.మున్సిపాలిటీల్లో దోమలు, పందులు, కుక్కలు, కోతుల బెడద నివారణ. సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి కోసం బీజేపీ మేనిఫెస్టో అంటూ రూపకల్పన తొలిసారి తెలంగాణలో అన్ని మున్సిపల్ వార్డుల్లో పోటీ చేస్తున్న బీజేపీ మెజారీటీ స్థానాల్లో కాషాయ జెండా ఎగురవేయాలని పార్టీ పట్టుదలతో ఉంది. 60 శాతానికి పైగా మున్సిపాలిటీలు, కనీసం 5 కార్పొరేషన్లను దక్కించుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. ఇందుకోసం స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కష్టపడుతున్నారు. బీజేపీ యువ మోర్చాకు ఈ ఎన్నికల్లో ప్రత్యేక టాస్క్ ఇచ్చారు. జెన్-జీ టార్గెట్‌గా ప్రచారంలో వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com