'హైపర్'లో రామ్..
- July 30, 2016
ఎనర్జీకి మారుపేరు యువ కథానాయకుడు రామ్. సినిమా కోసం ఎంతటి శ్రమ అయినా చేస్తారు. ఈ ఏడాది తొలి రోజు 'నేను శైలజ' అంటూ వచ్చి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. రాశీఖన్నా కథానాయిక. రామ్‌లో ఉన్న ఎనర్జీకి తగినట్లుగా ఈ చిత్రానికి 'హైపర్' అనే పేరును ఖరారు చేశారు. ప్రతి ఇంట్లో ఒకడుంటాడు అనేది ట్యాగ్ లైన్. ఈ సందర్భంగా 'హైపర్' సెట్‌లోని ఒక ఫొటోను చిత్ర బృందం ట్వీట్ చేసింది. ఫస్ట్‌లుక్‌ను ఆగస్టు 3న విడుదల చేయనున్నట్లు తెలిపింది.గతంలో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ 'కందిరీగ' చిత్రంలో నటించారు. హిట్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కావడంతో ఈ చిత్రంపై అభిమానులకు మంచి అంచనాలే ఉన్నాయి.
తాజా వార్తలు
- కువైట్ వెదర్ అలెర్ట్..రెండు రోజులపాటు వర్షాలు..!!
- సోహార్‌లోని కార్మికుల వసతి గృహంలో అగ్నిప్రమాదం..!!
- ట్రంప్ శాంతి మండలిలో చేరిన ఖతార్..!!
- బంగారం ధర $5,000కి చేరుకుంటుందా?
- బహ్రెయిన్ ఆటమ్ ఫెయిర్..24 దేశాల నుండి 600 మంది ఎగ్జిబిటర్లు..!!
- సౌదీలో అమల్లోకి సౌదీయేతర రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ రెగ్యులేషన్స్..!!
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు







