మణిరత్నం తో నాని...
- July 30, 2016
సినిమా ఎప్పుడంటే?దర్శకుడు మణిరత్నంకి యువ కథానాయకుడు నాని వీరాభిమాని. ఆయన దర్శకత్వంలో ఒక్క సినిమానైనా చేయాలనేది తన కల అని చెబుతుంటాడు. 'ఓకే బంగారం' చిత్రంవల్ల ఎట్టకేలకి మణిరత్నం దృష్టిలో పడ్డాడు నాని. దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా మణిరత్నం తెరకెక్కించిన ఆ చిత్రానికి తెలుగులో నానినే డబ్బింగ్ చెప్పాడు. దాంతో మణిరత్నంకీ, నానికీ మధ్య పరిచయం బాగా పెరిగింది. 'ఓకే బంగారం' తర్వాత నానితోనే మణిరత్నం ఓ సినిమా చేయబోతున్నాడని ప్రచారం సాగింది. ఏమైందో తెలియదు కానీ... ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ప్రస్తుతం కార్తీ కథానాయకుడిగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు మణి. అదయ్యాక నానితో సినిమా పక్కా అని తెలుస్తోంది. ఆ విషయాన్ని ఓ హీరోయిన్ బయటపెట్టింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. సయామీ ఖేర్. 'రేయ్' అనే చిత్రంతో తెలుగు తెరపై మెరిసింది సయామీ. నాని కథానాయకుడిగా తెరకెక్కించాలనుకొన్న సినిమాలో కథానాయికగా సయామీఖేర్‌నే ఎంపిక చేసుకోవాలను కొన్నాడట మణిరత్నం. ఆ విషయాన్ని చెబుతూ 'ఇప్పటికీ నేను మణిసార్‌తో టచ్‌లోనే ఉన్నా. త్వరలోనే మాతో ఆయన సినిమా చేస్తార'ని స్పష్టం చేసింది సయామీ.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







