తెదేపా ఎంపీలతో భేటీ కానున్నా చంద్రబాబు
- July 30, 2016
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఉదయం విజయవాడలో తెదేపా ఎంపీలతో భేటీ కానున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, కేంద్రం నుంచి నిధులు రాబట్టడంపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. సమావేశానికి హాజరుకావాలని సీఎం కార్యాలయం నుంచి ఎంపీలకు సమాచారం అందింది. ప్రత్యేక హోదాపై నిన్న రాజ్యసభలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చేసిన ప్రకటనపై తెదేపా నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. పశ్చిమగోదావరి జిల్లాలో ఇవాళ రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ..రేపటి సమావేశంలో ప్రత్యేక హోదాపై సీఎంతో చర్చిస్తామని తెలిపారు. అవసరం అనుకుంటే రాజీనామాకైనా సిద్ధమని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







