‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ట్రైలర్ విడుదల
- February 07, 2026
టాలీవుడ్‌లో ఒకప్పుడు ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటీనటులు శివాజీ, లయ చాలా కాలం తర్వాత మళ్లీ జంటగా నటించిన క్రైమ్ కామెడీ చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఇప్పుడు మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. థియేటర్లలో విడుదల కాకుండా నేరుగా డిజిటల్ వేదికగా విడుదలవుతోంది.అయితే ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ (OTT) ఈటీవీ విన్ దక్కించుకోగా ఈ సినిమాను ఈ నెల 12 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించింది.
ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే పంచాయితీ సెక్రటరీ అయిన శ్రీరామ్ నీతి, నిజాయితీ అంటూ బ్రతుకుతుంటాడు. అయితే అతడి జీవితంలోకి అనుకోకుండా వచ్చిన సంఘటనలు ఏంటి అతడిని పోలీసులు, రౌడీలు ఎందుకు వెతుకుతుంటారు అనేది ఈ సినిమా కథ. క్రైమ్ కామెడీగా ఈ చిత్రం రాబోతుంది. ఒకప్పుడు వెండితెరపై సూపర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న శివాజీ, లయ ఇందులో మళ్లీ జంటగా నటిస్తుండటంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







