ఉగ్రవాదం పై రాజీ లేదు: ప్రధాని మోదీ
- February 08, 2026
కౌలాలంపూర్: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ కఠిన విధానాన్నే కొనసాగిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మలేషియా పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయిన మోదీ, ఉగ్రవాదంపై భారత్ వైఖరి పూర్తిగా స్పష్టమని, ఈ విషయంలో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలు లేదా రాజీ విధానానికి తావులేదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా భారత్–మలేషియా ద్వైపాక్షిక సంబంధాలపై కూడా ఆయన మాట్లాడారు. ఇరు దేశాలు సముద్ర సరిహద్దులు పంచుకుంటున్నాయని, ప్రజల మధ్య సాంస్కృతిక, వాణిజ్య, ఆర్థిక సంబంధాలు బలంగా ఉన్నాయని మోదీ తెలిపారు. రెండు దేశాల మధ్య భాగస్వామ్యం ప్రాంతీయ భద్రత, వాణిజ్యం, పెట్టుబడులకు కీలకంగా మారిందన్నారు.
అలాగే ఇండో–పసిఫిక్ ప్రాంతం ప్రపంచ ఆర్థిక వృద్ధికి ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని మోదీ వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతంలో శాంతి, భద్రత, స్థిరత్వం కోసం భారత్ ఇతర దేశాలతో కలిసి పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. భద్రత, రక్షణ, వాణిజ్యం, సాంకేతిక రంగాల్లో మలేషియాతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లో అనధికార ఫుడ్ సెల్లర్స్ పై కొరడా..!!
- ఒమన్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి..!!
- ఖతార్ లో ఫిబ్రవరి 10న హాలీడే..!!
- బహ్రెయిన్ లో ‘గ్రాండ్‌మాస్టర్ ఇండియా క్విజ్’..!!
- సౌదీ అరేబియాలో 70%కి పెరిగిన రోడ్ సేఫ్టీ రేట్..!!
- చెన్నైలో భారీ పొగమంచు..దుబాయ్ ఫ్లైట్ బెంగళూరుకు మళ్లింపు..!!
- ప్రజల తరపున ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు: కేటీఆర్
- 27 భాషల్లో యూట్యూబ్ వీడియోలు
- ఏపీలో మరో ప్రతిష్టాత్మక సంస్థ
- ఉగ్రవాదం పై రాజీ లేదు: ప్రధాని మోదీ









