27 భాషల్లో యూట్యూబ్ వీడియోలు
- February 08, 2026
27 భాషల్లో యూట్యూబ్ వీడియోలు
యూట్యూబ్ ఏఐ ఆధారిత ఆటో-డబ్బింగ్ సౌకర్యాన్ని అన్ని ఛానెళ్లకు విస్తరించింది. ఈ ఫీచర్ ద్వారా వీడియోలను 27 భాషల్లోకి స్వయంచాలకంగా డబ్ చేసి చూడవచ్చు. భాషా అడ్డంకులు లేకుండా ప్రపంచవ్యాప్తంగా కంటెంట్‌ను(Content Creators) ఆస్వాదించే అవకాశం ప్రేక్షకులకు లభిస్తోంది.
2023లో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ టెక్నాలజీని 2024లో విద్యా, సమాచార వీడియోలకు విస్తరించారు. ప్రస్తుతం మ్యూజిక్ వీడియోలు మినహా దాదాపు అన్ని రకాల వీడియోలకు ఇది అందుబాటులో ఉంది. యూట్యూబ్ ప్రకారం, 2025 డిసెంబర్ నాటికి రోజుకు సగటున 60 లక్షల మంది పైగా ప్రేక్షకులు కనీసం 10 నిమిషాల పాటు ఆటో-డబ్ చేసిన వీడియోలను వీక్షించారు.
ఈ అప్‌డేట్‌లో ‘ఎక్స్‌ప్రెసివ్ స్పీచ్’ అనే కొత్త ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టారు. ఇది డబ్బింగ్ వాయిస్‌ను సహజంగా, అసలు స్పీకర్ టోన్, భావాలకు దగ్గరగా వినిపించేలా చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ హిందీ, ఇంగ్లీష్, స్పానిష్ సహా ఎనిమిది భాషల్లో (Content Creators)అందుబాటులో ఉంది. అలాగే, మాట్లాడే వ్యక్తి పెదవుల కదలికలకు సరిపడేలా ‘లిప్ సింక్’ టెక్నాలజీపై యూట్యూబ్ ప్రయోగాలు కొనసాగిస్తోంది.
వీక్షకులు తమకు ఇష్టమైన భాషను ఎంచుకునేందుకు ‘ప్రిఫర్డ్ లాంగ్వేజ్’ ఆప్షన్‌ను జోడించారు. క్రియేటర్లు కావాలంటే ఈ ఆటో-డబ్బింగ్ ఫీచర్‌ను ఆఫ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ టెక్నాలజీతో క్రియేటర్లు తమ కంటెంట్‌ను అంతర్జాతీయ స్థాయిలో విస్తృత ప్రేక్షకులకు చేరువ చేయగలుగుతున్నారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వేడిగాలులు
- పాపిరెడ్డిపాళెంలో 9 రోజుల ఉచిత కంటి వైద్య శిబిరం
- కువైట్ లో అనధికార ఫుడ్ సెల్లర్స్ పై కొరడా..!!
- ఒమన్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి..!!
- ఖతార్ లో ఫిబ్రవరి 10న హాలీడే..!!
- బహ్రెయిన్ లో ‘గ్రాండ్‌మాస్టర్ ఇండియా క్విజ్’..!!
- సౌదీ అరేబియాలో 70%కి పెరిగిన రోడ్ సేఫ్టీ రేట్..!!
- చెన్నైలో భారీ పొగమంచు..దుబాయ్ ఫ్లైట్ బెంగళూరుకు మళ్లింపు..!!
- ప్రజల తరపున ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు: కేటీఆర్
- 27 భాషల్లో యూట్యూబ్ వీడియోలు









