సల్మానియా మెడికల్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం..తప్పిన పెనుప్రమాదం..!!
- February 09, 2026
మనామా: సల్మానియా మెడికల్ కాంప్లెక్స్‌లోని అల్ ఫతే భవనంలో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. అయితే, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ వేగంగా స్పందించడంతో మంటలు త్వరగా అదుపులోకి వచ్చాయని ప్రభుత్వ ఆసుపత్రులు వెల్లడించాయి. సివిల్ డిఫెన్స్ క్విక్ రియాక్షన్ కారణంగా పెను ప్రమాదం తప్పిందని, మంటల వ్యాప్తిని అడ్డుకోవడంతో ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.
ఆస్పత్రిలోని పేషంట్లు, కేర్ టేకర్స్, సందర్శకులు, వైద్యసిబ్బంది అందరూ సేఫ్ గా ఉన్నారని, సోషల్ మీడియాలో అనధికార కథనాలను నమ్మొద్దని కోరారు. ముందుజాగ్రత్తగా అల్ ఫతే భవనంలో పూర్తి స్థాయిలో తనిఖీలు పూర్తి చేసినట్టు, మరిన్ని తనిఖీల కోసం మూడు రోజులపాటు సాధారణ కార్యకలాపాలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఆస్పత్రి మేనేజ్ మెంట్ ప్రకటించింది.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







