ట్రాఫిక్ కు చెక్..అల్ ఖుద్రాలో కొత్త 4-లేన్ల బ్రిడ్జి ప్రారంభం..!!
- February 09, 2026
యూఏఈ: దుబాయ్ లోని అల్ ఖుద్రా రోడ్డు మరియు అరేబియన్ రాంచెస్ను దుబాయ్ స్టూడియో సిటీతో కలిపే లింక్ రోడ్డు ఇంటర్ సెక్షన్ వద్ద నిర్మించిన కొత్త బ్రిడ్జిని ప్రారంభించినట్లు రోడ్లు మరియు రవాణా అథారిటీ ప్రకటించింది. నాలుగు లేన్లతో కూడిన 600 మీటర్ల ఈ బ్రిడ్జి, అల్ ఖుద్రా రోడ్డు వెంబడి ఉన్న ప్రధాన ఇంటర్ సెక్షన్స్ అభివృద్ధి ప్రాజెక్ట్‌లో భాగం అని తెలిపింది.
ఈ కొత్త కారిడార్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డుతో కలిసే ఇంటర్ సెక్షన్ నుండి ప్రారంభమై, షేక్ జాయెద్ బిన్ హమ్దాన్ అల్ నహ్యాన్ స్ట్రీట్ మరియు ఎమిరేట్స్ రోడ్డు మీదుగా వెళుతుంది. కొత్త బ్రిడ్జి ట్రాఫిక్ సామర్థ్యాన్ని 191 శాతం పెంచి, గంటకు 6,600 వాహనాల నుండి గంటకు 19,200 వాహనాలకు చేరుస్తుందని అథారిటీ తెలిపింది.
కాగా, అల్ ఖుద్రా రోడ్డు మరియు షేక్ జాయెద్ బిన్ హమ్దాన్ అల్ నహ్యాన్ స్ట్రీట్ ఇంటర్ సెక్షన్ వద్ద నిర్మించిన ఈస్ట్ బ్రిడ్జిని ఫిబ్రవరి 15న ప్రారంభించనున్నట్లు అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







