‘మనసంతా నువ్వే’ రీ రిలీజ్
- February 09, 2026
ఉదయ్ కిరణ్, రీమాసేన్, తనూరాయ్ కీలక పాత్రల్లో నటించిన సూపర్ హిట్ లవ్ స్టోరీ వాలంటైన్స్ డే సందర్భంగా ‘మనసంతా నువ్వే’ మరోసారి థియేటర్లలోకి రానుంది. ఈ నెల 14న, తిరిగి విడుదల కానుంది.. 25 ఏళ్ల క్రితం విడుదలై ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని ఎం.ఎస్. రాజు నిర్మించారు. వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రైమ్ షో నిరంజన్ రెడ్డి, చైతన్యారెడ్డి, శ్రీ మాత క్రియేషన్స్ రఘురామ్ రెడ్డి, రవికాంత్ రెడ్డి రీ రిలీజ్ చేస్తున్నారు.అప్పట్లో 250 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడిన ఈ సినిమా, ఇప్పటి యువతను కూడా ఆకట్టుకుంటుందని నిర్మాతలు ఆశిస్తున్నారు.
ఫిబ్రవరి మధ్యలో వచ్చే ఈ ప్రత్యేక వారం యువతకు మాత్రమే కాదు, సినీ అభిమానులకు కూడా ఎంతో ప్రత్యేకంగా మారింది. లవ్, ఎమోషన్‌ని ప్రతిబింబించే సినిమాలు ఈ టైమ్‌లో థియేటర్లలో సందడి చేస్తూ యువతలో మరింత ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంటాయి. అందుకే ఏటా ప్రేమికుల దినోత్సవం వచ్చిందటే చాలు థియేటర్లు ప్రేమికులతో నిండిపోతుంటాయి. ఈసారి కూడా టాలీవుడ్‌లో వాలంటైన్స్ డే వారం మరింత ప్రత్యేకంగా మారింది. ఇప్పటికే పాత సినిమాలను మళ్లీ పెద్ద తెరపై చూపించే రీ రిలీజ్ ట్రెండ్ బలంగా కొనసాగుతున్న వేళ ఈ వారం ఏకంగా ఐదు ప్రేమ కథా చిత్రాలు మళ్లీ థియేటర్లలోకి వస్తున్నాయి. దీంతో లవ్‌స్టోరీలను ఆరాధించే ప్రేక్షకులకు ఇది మూవీ ఫెస్టివల్‌గా మారింది.
తాజా వార్తలు
- ఔద్ మైథా రోడ్–అల్ అసాయెల్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి
- సెప్టెంబర్ 23న షేక్ మహమ్మద్ లీడర్షిప్ ఫోరం
- స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- షార్జా–ఒమన్ కారిడార్‌లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..







