దుబాయ్ గ్లోబల్ విలేజ్ రమదాన్ టైమింగ్స్, స్పెషల్స్..!!
- February 09, 2026
దుబాయ్: ప్రస్తుతం 30వ సీజన్‌లో ఉన్న దుబాయ్ గ్లోబల్ విలేజ్, పవిత్ర రమదాన్ మాసాన్ని పురస్కరించుకొని కొత్త టైమింగ్స్ ను ప్రకటించింది. రమదాన్ మాసంలో ఆదివారం నుండి బుధవారం వరకు సాయంత్రం 5 గంటల నుండి తెల్లవారుజాము 1 గంటల వరకు మరియు గురువారం నుండి శనివారం వరకు సాయంత్రం 5 గంటల నుండి తెల్లవారుజాము 2 గంటల వరకు గ్లోబల్ విలేజ్ తెరిచి ఉంటుంది.
రమదాన్ నేపథ్యంలో గ్లోబల్ విలేజ్ ప్రత్యేకమైన కార్యక్రమాలను ప్రకటించింది. ఆర్కెస్ట్రా, ఔద్, నే, హార్ప్, వయోలిన్ మరియు సాంప్రదాయ తన్నౌరా ప్రదర్శనలతో సహా ఇస్లాం సాంస్కృతిక థీమ్ ను తెలియజేసేలా ప్రత్యక్ష ప్రదర్శనలను నిర్వహించనుంది. మైతా మొహమ్మద్ హోస్ట్ చేసే అఖేర్ కలాం షో ఫిబ్రవరి 18 నుండి మార్చి 18 వరకు రాత్రి 11 గంటలకు ప్రధాన వేదికపై నిర్వహిస్తారు.
ఇక అబ్దుల్లా ఎస్మాయీల్ హోస్ట్ చేసే అల్ మండూస్ లైవ్ గేమ్ షో ఫిబ్రవరి 20న ప్రారంభమై వరుసగా మూడు వీకెండ్లలో రాత్రి 9.30 గంటలకు ప్రధాన వేదికపై జరుగుతుంది. అదే విధగా పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని, ఫిబ్రవరి 20న రాత్రి 9.30 గంటలకు అద్భుతమైన డ్రోన్ ప్రదర్శనను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. వీటితోపాటు ఇఫ్తార్ మరియు సుహూర్ కోసం ప్రత్యేకమైన సాంప్రదాయ రుచులను ఆస్వాదించేందుకు వీలుగా స్టాళ్లను ఏర్పాటు చేయనుంది.
తాజా వార్తలు
- వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్!
- మక్కాలో ఐదుగురు పాకిస్థానీలు అరెస్ట్..!!
- బర్కా, యాంకుల్కు WHO ‘హెల్తీ సిటీ’ గుర్తింపు..!!
- 2030 విజన్ కోసం ఖతార్ కీలక అడుగు..!!
- మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదాలు–15 మంది మృతి!
- పాస్‌పోర్ట్ అవసరం లేదు.. లగేజ్ ట్యాగ్ కూడా ఉండదు..!!
- షార్జా ఎక్స్పో సెంటర్లో మమ్ముట్టి ‘రాజకీయమ్’ షో..
- జగదీశ్వరరెడ్డిని సైనైడ్‌తో కడతేర్చిన సాధిక్‌ఖాన్
- BRICS శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యే అతిథుల పూర్తి జాబితా
- UAEలో 2027లో పబ్లిక్ హాలిడేలలో భారీ మార్పు.. 2026తో పోలిస్తే తగ్గనున్న సెలవులు







