రియాద్‌లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!
- February 09, 2026
రియాద్: రియాద్‌కు ఉత్తరాన ఉన్న ముల్హామ్‌లో మూడవ వరల్డ్ డిఫెన్స్ షో 2026ను సౌదీ రక్షణ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ ప్రారంభించారు. ఐదు రోజుల పాటు ఈ ప్రదర్శన జరుగుతుంది.
మొదటి రోజున, సౌదీ సంస్థలు మరియు అంతర్జాతీయ కంపెనీల మధ్య పలు ఒప్పందాలు మరియు అవగాహన ఒప్పందాలను ప్రకటించారు. జనరల్ అథారిటీ ఫర్ మిలిటరీ ఇండస్ట్రీస్ (GAMI) , సౌదీ అరేబియన్ మిలిటరీ ఇండస్ట్రీస్ కంపెనీ (SAMI)తో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. జనరల్ ఎలక్ట్రిక్‌తో మరియు ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్‌తో మరో అవగాహన ఒప్పందంపై కూడా GAMI ఒప్పందం చేసుకుంది. సైనిక విమానయాన రంగంలో GE ఏరోస్పేస్ మరియు మిడిల్ ఈస్ట్ ప్రొపల్షన్ కంపెనీ, రాయల్ సౌదీ వైమానిక దళం మధ్య మూడు ఒప్పందాలు కుదిరాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాయల్ సౌదీ ఎయిర్ ఫోర్స్ చేపట్టిన విన్యాసాలు అందరిని మంత్రముగ్ధులను చేశాయి.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







