ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- February 09, 2026
దోహా: ఖతార్ లో మొదటి ఎడిషన్ ఆర్ట్ బాసెల్ ఆర్ట్ బాసెల్ విజయవంతంగా ముగిసింది. ఖతార్ స్పోర్ట్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ (QSI) మరియు QC+ భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ ప్రారంభ ఎడిషన్‌కు దోహాతోపాటు పలు దేశాలకు చెందిన ఎయిర్ నిపుణులు తరలివచ్చారు. ముఖ్యంగా ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ మరియు యూరప్ నుండి వచ్చిన కళాకారులు మమేకమై, సమన్వయంతో ఆకట్టుకున్నారని పేర్కొన్నారు.
మిడిలీస్టు, ఉత్తర ఆఫ్రికా, దక్షిణాసియా మరియు గ్లోబల్ సౌత్ కళాకారుల ప్రదర్శనలకు జనం కిక్కిరిసి ఉన్నారు. గ్యాలరీలు మరియు వర్ధమాన కళాకారుల సోలో ప్రదర్శనలు, వారి ముఖ్యమైన కళాఖండాలు విజిటర్స్ దృష్టిని ఆకర్షించినట్లు తెలిపారు.
అమీర్ హెచ్ హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ మరియు ఇతర ఉన్నత స్థాయి అధికారులు ఈ ఫెయిర్‌ను సందర్శించారు. ప్రపంచవ్యాప్తంగా 85 కంటే ఎక్కువ మ్యూజియంలు మరియు ఫౌండేషన్‌ల ప్రతినిధులు ఆర్ట్ బాసెల్ ఖతార్‌కు హాజరయ్యారు. ఇది ఖతార్, విస్తృత మెనాసా ప్రాంతం మరియు యూరప్, ఆసియా, ఆఫ్రికా మరియు అమెరికా అంతటా అభిమానులను సంపాదించుకుందని ఆర్ట్ బాసెల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నోహ్ హోరోవిట్జ్ తెలిపారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







