యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!
- February 10, 2026
యూఏఈ: రైల్వే ట్రాక్‌లపై ప్రయాణించగల ప్రత్యేక అంబులెన్స్.. యూఏఈ మరియు సౌదీ అరేబియాలో అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా మారుమూల ఎడారి ప్రాంతాలలో అత్యవసర వైద్య సేవలను అందివ్వనుంది. నాఫ్కో స్థానికంగా నిర్మించిన ఈ వాహనం సాంప్రదాయ అంబులెన్స్‌లు చేరుకోవడానికి ఇబ్బందులుండే ప్రాంతాలను సైతం ఇది నావిగేట్ చేయడానికి వీలు కల్పిస్తుంది.
యూఏఈ మరియు సౌదీ అరేబియా విస్తృతమైన రైలు నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తున్నందున, ఈ రైలు అంబులెన్స్‌లు ఇతర అంబులన్స్ లు ప్రవేశించలేని ప్రాంతాలలోని పేషంట్లను చేరుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయని నాఫ్కో FZCOలో సేల్స్ అకౌంట్ మేనేజర్ మొహమ్మద్ అబ్దుల్ జబ్బర్ ప్రపంచ ఆరోగ్య ఎక్స్‌పో (WHX) సందర్భంగా వెల్లడించారు. ఈ రైలు అంబులెన్స్ లో అత్యవసర సంరక్షణ కోసం స్లైడింగ్ ప్లెక్సిగ్లాస్, ఆక్సిజన్ మరియు వాక్యూమ్ సిస్టమ్‌లు, DC మరియు AC పవర్ అవుట్‌లెట్‌లు, షార్ప్ ల కంటైనర్లు, ఇన్సులేటెడ్ కిటికీలు మరియు ఫోల్డబుల్ స్టెప్‌లతో వెనుకవైపు మెడికల్ క్యాబినెట్‌ను కలిగి ఉంటుంది. ఇక వైద్య పరికరాలలో ప్రధాన స్ట్రెచర్, మెట్ల కుర్చీ, స్కూప్ మరియు ఫోల్డింగ్ స్ట్రెచర్‌లు, AED (ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్), పోర్టబుల్ వెంటిలేటర్, స్పైన్ బోర్డ్, ట్రాక్షన్ స్ప్లింట్, ప్రథమ చికిత్స మరియు ట్రామా కిట్‌లు, సక్షన్ యూనిట్ మరియు దుప్పట్లు మరియు శానిటైజర్‌లు వంటి అవసరమైన రోగి సంరక్షణ పరికరాలు ఉంటాయని తెలిపారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







