బహ్రెయిన్‌లో ఇండియన్ బడ్జెట్ 2026పై సెమినార్..!!
- February 11, 2026
మనామా: బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం భారత బడ్జెట్ 2026 పై సెమినార్ నిర్వహించింది. యూనియన్ బడ్జెట్ ప్రత్యేకతలు, కల్పించిన రాయితీలు, అవకాశాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వక్తలు, కార్మిక మరియు సామాజిక వ్యవహారాల మాజీ మంత్రి అబ్దుల్ నబీ అల్ షోలా; స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బహ్రెయిన్ కంట్రీ హెడ్ మధు రామన్‌కుట్టి; ICICI సీనియర్ ఫండ్ మేనేజర్ ఇహాబ్ దల్వాయి , బహ్రెయిన్- ఇండియా సొసైటీ చైర్మన్ అబ్దుల్రహ్మాన్ జుమా పాల్గొన్నారు.
భారత రాయబారి వినోద్ కె. జాకబ్ మాట్లాడుతూ.. భారత బడ్జెట్ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిందని, 7.4 శాతం వృద్ధి అంచనాతో USD 4.13 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపొందుతుందని ఆయన పేర్కొన్నారు. ఇక GDPలో 4.3 శాతం ఆర్థిక లోటు మరియు 55.6 శాతం రుణ-GDP నిష్పత్తి ఉందని రాయబారి హైలైట్ చేశారు.
భారతదేశాన్ని విశ్వసనీయ ప్రపంచ పెట్టుబడి గమ్యస్థానంగా నిలిపేందుకు, ఆర్థిక సంస్కరణలు, వ్యాపార సౌలభ్యత, దీర్ఘకాలిక వృద్ధి, ప్రజల-కేంద్రీకృత అభివృద్ధిపై భారత ప్రభుత్వం దృష్టి సారించిందని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి వాణిజ్య పరిణామాలను ప్రస్తావిస్తూ, చారిత్రాత్మక భారత్ -ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ప్రపంచ ఆర్థిక మరియు వాణిజ్య సంబంధాలను మరింతగా బలోపేతం చేయడంలో భారత్ యొక్క నిబద్ధతను తెలియజేస్తుందని వివరించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







