ఆగష్టు 5న విడుదలకానున్న 'ఆటాడుకుందాం రా' సినిమా పాటలు

- July 30, 2016 , by Maagulf
ఆగష్టు 5న విడుదలకానున్న 'ఆటాడుకుందాం రా' సినిమా పాటలు

సుశాంత్‌, సోనమ్‌ జంటగా రూపుదిద్దుకుంటున్న 'ఆటాడుకుందాం.. రా' చిత్రం ఆడియోను ఆగస్టు 5న విడుదల చేస్తున్నారు. హీరో సుషాంత్‌ సోషల్‌మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ.. పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం మీ అందరికీ నచ్చుతుందని ట్వీట్‌ చేశారు. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి చింతలపూడి శ్రీనివాస్‌, ఎ. నాగ సుశీల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. బ్రహ్మానందం, వెన్నెల కిశోర్‌, పృథ్వీరాజ్‌, మురళీశర్మ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com