'ఓం నమో వేంకటేశాయ' తొలి ప్రచార చిత్రం

- July 30, 2016 , by Maagulf
'ఓం నమో వేంకటేశాయ' తొలి ప్రచార చిత్రం

కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటున్న భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'. శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుడు హథీరామ్‌ బాబా జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీ వేంకటేశ్వర స్వామి పాత్రను పరిచయం చేస్తూ చిత్ర బృందం తొలి ప్రచార చిత్రంగా ఓ వీడియోను విడుదల చేసింది. నటుడు సౌరభ ఈ చిత్రంలో స్వామివారి పాత్రను పోషిస్తున్నట్లు వీడియోలో తెలిపారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. నాగార్జున, రాఘవేంద్రరావు, కీరవాణి కాంబినేషన్లో వస్తున్న నాల్గవ భక్తిరస చిత్రమిది. అనుష్క, ప్రగ్యా జైశ్వాల్‌ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com