బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ రియల్టీ సంస్థ అన్విత గ్రూప్
- February 14, 2026
అన్విత గ్రూప్ చైర్మన్ బొప్పన అచ్యుత రావు, సంస్థ బ్రాండ్ అంబాసిడర్ నందమూరి బాలకృష్ణ
* ఇల్లు చేతికొచ్చాకే వాయిదా
* అన్విత10 /90 స్కీమ్‌తో సొంతింటి కల ఇక సులభం
* కొత్త ప్రాజెక్టులతో భారీ విస్తరణ దిశగా శ్రీకారం
* భారత్‌లో అగ్రశ్రేణి కంపెనీల్లో ఒకటిగా సంస్థ ఉన్నతి
హైదరాబాద్: ప్రముఖ రియల్టీ సంస్థ అన్విత గ్రూప్ తాజాగా 10/90 స్కీమ్ ప్రకటించింది. ఫ్లాట్ ధరలో ముందస్తుగా 10 శాతం చెల్లిస్తే, ఇల్లు చేతికి వచ్చాకే కస్టమర్‌కు ఈఎంఐ ప్రారంభం అవుతుందని అన్విత గ్రూప్ చైర్మన్ బొప్పన అచ్యుత రావు , సంస్థ బ్రాండ్ అంబాసిడర్ నందమూరి బాలకృష్ణ సంయుక్తంగా తెలిపారు. కంపెనీ బ్రాండ్ అంబాసిడర్, పద్మ భూషణ్ నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా శనివారం స్కీమ్‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా బొప్పన మీడియాతో మాట్లాడుతూ . ‘చాలా మంది కస్టమర్లకు ఇతర లోన్స్ ఉంటాయి. దీంతో ఇల్లు చేతికి రాక పూర్వమే గృహ రుణం వాయిదా చెల్లించవలసి రావటం అదనపు భారం అవుతుంది. ఈ క్రమంలోనే నిర్మాణం పూర్తి చేసి కొనుగోలు దారులకు గృహం అందించే వరకు ఆ భారాన్ని కంపెనీ తీసుకుంటుంది. ఈ సౌలభ్యంతో ఎక్కువ మంది ఇల్లు తీసుకునేందుకు ముందుకు వస్తారు’ అని తెలిపారు. "కస్టమర్ పెట్టిన ప్రతి రూపాయికీ విలువ చేకూర్చడం, అంతర్జాతీయ ప్రాజెక్టుల అనుభవం, అందుబాటు ధర, ప్లాటినమ్ రేటింగ్ స్టాండర్డ్స్.. ఈ ప్రత్యేకతలన్నీ అన్విత ప్రతిష్టను పెంచుతున్నాయి" అని బాలకృష్ణ అన్నారు. పలువురు కస్టమర్లకు ఈ సందర్భంగా నందమూరి నూతన గృహాల తాళాలను అందజేశారు.

భారీ విస్తరణ దిశగా..
అన్విత ఖాతాలో ప్రస్తుతం 1 కోటి చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రాజెక్టులు నిర్మాణంలో ఉండగా, వీటి కింద 4,200 యూనిట్లు రానున్నాయి. వివిధ అనుమతుల దశల్లో 2 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో మూడు, వైజాగ్, విజయవాడలో ఒక్కో ప్రాజెక్ట్ ఏర్పాటు కానుంది. ఈ అయిదు ప్రాజెక్టులకుగాను 11,000 యూనిట్లు కొలువుదీరనున్నాయి. 2029 నాటికి వీటిని కస్టమర్లకు అప్పగించాలని కంపెనీ కృతనిశ్చయంతో ఉంది. ఫ్లోర్ ప్లానింగ్, క్లబ్ హౌజ్, ఆంబియెన్స్, అమెనిటీస్ వంటి అంశాల్లో వినియోగదార్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో ఈ ప్రాజెక్టులకు రూపకల్పన చేశామని అచ్యుత రావు తెలిపారు.

దేశంలో తొలిసారిగా స్కై వాక్..
హైదరాబాద్ సమీపంలోని కొల్లూరు వద్ద అన్విత ‘హై–9’ ప్రాజెక్టు నిర్మితం అవుతోంది . 9 టవర్లలో 31 అంతస్తుల్లో 2,200 ఫ్లాట్స్ రూపుదిద్దుకో నున్నాయి. దేశంలో తొలిసారిగా అన్ని టవర్లను కలుపుతూ 1.6 కిలోమీటర్ల స్కైవాక్ ఏర్పాటు చేయటం అన్విత ప్రత్యేకత. కొల్లూరు వద్ద మరో ప్రాజెక్టు ‘ఇవానా’ తొలి దశ గడువు కంటే ఏడాది ముందే పూర్తి అయింది. రెండు టవర్లలో 450 యూనిట్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 1,400 యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయి. పోడియం లెవెల్లో ఫ్లాట్స్ నిర్మాణం చేపట్టకపోవడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. గ్రీనరీకి పెద్ద పీట వేశారు. 3 ఎకరాల్లో సెంట్రల్ పార్క్ కొలువుదీరుతోంది.
మేడ్చల్ వద్ద పార్క్ సైడ్
ఇక మేడ్చల్‌కు సమీపంలో అన్విత ‘పార్క్ సైడ్’ ప్రాజెక్ట్ 50 ఎకరాల్లో వస్తోంది. 15 క్లస్టర్స్‌గా 270 విల్లాలు ఏర్పాటు అవుతాయి. పార్కుతో ప్రతి విల్లాను అనుసంధానం చేస్తారు.
విదేశీ గడ్డపై సైతం..
తెలుగు నేలపై విజయవంతంగా ప్రాజెక్టులను చేపట్టిన అన్విత గ్రూప్ విదేశీ గడ్డపైనా జెండా ఎగురవేయాలని కృతనిశ్చయంతో ఉంది. యూఎస్‌లోని డల్లాస్ లో 17 ఎకరాల్లో గృహ సముదాయానికి కంపెనీ శ్రీకారం చుట్టింది. అలాగే అక్కడ అంతర్జాతీయ కార్పొరేట్ కార్యాలయం సైతం ఏర్పాటు చేస్తోంది. 500 ఎకరాల విస్తీర్ణంలో 1,700 విల్లాలతో కూడిన భారీ ప్రాజెక్టు సైతం రానుందని అచ్యుత రావు వెల్లడించారు. ఈ ఏడాదే దుబాయిలో రియల్టీ ప్రాజెక్టును లాంచ్ చేయనున్నట్టు ప్రకటించారు.

వేలల్లో ఉపాధి..
అన్విత గ్రూప్‌నకు ఇప్పటికే 1,800 మంది కస్టమర్లు ఉన్నారు. దుబాయిలో పలు భారీ ప్రాజెక్టుల్లో కంపెనీ పాలుపంచుకుంది. ప్రస్తుతం కంపెనీలో ప్రత్యక్షంగా 300 మంది ఉద్యోగులు ఉన్నారు. పరోక్షంగా 6,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. మూడేళ్లలో సిబ్బంది సంఖ్య 1,000కి చేరుతుందని అచ్యుత రావు వెల్లడించారు. ఆ సమయానికి 15,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని చెప్పారు. భారత్‌లో అతిపెద్ద రియల్టీ కంపెనీల్లో ఒకటిగా అనతి కాలంలోనే సుస్థిర స్థానం సంపాదిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కంపెనీ డైరెక్టర్స్ నాగభూషణం బొప్పన, శ్రీకాంత్, విజయ్ రాజ్, సెల్ కాన్ గురుస్వామి నాయుడు, మురళి, పవన్, సంతోష్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఏఐ ప్రభావం షాకింగ్, ఉద్యోగాలకు భారీ ముప్పు?
- Bangladesh: తారిక్ రెహమాన్ ప్రధాని కావడం భారత్‌కు ప్రయోజనమా?
- బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ రియల్టీ సంస్థ అన్విత గ్రూప్
- ఏపీ బడ్జెట్ 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
- అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాను ఛేదించిన యూఏఈ, కువైట్..!!
- కువైట్ ఎంబసీలో నేషనల్, లిబరేషన్ డే సెలబ్రేషన్స్..!!
- GCC లో పనిచేసే బహ్రెయిన్‌లకు నిరుద్యోగ బీమా..!!
- ఖసాబ్ లో భూకంపం వివరాలు వెల్లడి..!!
- ఖతార్ లో రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్..!!
- గాజా సంక్షోభం .. గ్లోబల్ వైఫల్యం: సౌదీ FM









