సౌదీ అరేబియాలో స్కూల్స్ టైమింగ్స్ ఛేంజ్..!!

- February 16, 2026 , by Maagulf
సౌదీ అరేబియాలో స్కూల్స్ టైమింగ్స్ ఛేంజ్..!!

రియాద్: సౌదీ అరేబియాలో పవిత్ర రమదాన్ మాసం కోసం సవరించిన పాఠశాల షెడ్యూల్‌లను ఆమోదించారు. దీని ప్రకారం స్కూల్స్ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి. మరికొన్ని ఉదయం 9:30 గంటలకు లేదా ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి.   

కాగా, ప్రభుత్వ పాఠశాలలు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయని, పెద్ద వారికి క్లాసులు రాత్రి 9:30 గంటలకు ప్రారంభమవుతాయని ఖాసిమ్ ప్రాంతంలోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రకటించింది. బోధన మరియు అడ్మిన్ సిబ్బంది మొదటి పీరియడ్ ప్రారంభానికి 15 నిమిషాల ముందు రిపోర్ట్ చేయాలని డైరెక్టరేట్ స్పష్టం చేసింది.

అదేవిధంగా, మక్కా ప్రాంతంలోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉదయం పాఠశాలలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని, పెద్దవారికి తరగతులు రాత్రి 9:30 గంటలకు ప్రారంభమవుతాయని తెలిపింది. రమదాన్ సమయంలో ఉద్యోగులకు అధికారిక పని గంటలు రోజుకు ఐదు గంటలు, ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటాయని డైరెక్టరేట్ పేర్కొంది.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com