యాకూబ్‌ మెమన్‌కు మరణశిక్ష ఖాయమైపోయింది

- July 21, 2015 , by Maagulf
యాకూబ్‌ మెమన్‌కు మరణశిక్ష ఖాయమైపోయింది

1993 నాటి ముంబై వరుస బాంబు పేలుళ్ల నిందితుడు యాకూబ్‌ మెమన్‌కు మరణశిక్ష ఖాయమైపోయింది. తనకు విధించిన ఉరిశిక్ష రద్దు కోసం సుప్రీంకోర్టుకు అతడు పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. యాకూబ్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇంతకుముందే నిరాకరించారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించినట్లుగా జూలై 30న యాకూబ్‌ను ఉరితీసే అవకాశాలున్నాయి. మొత్తం 257 మందిని బలిగొన్న నాటి దారుణ మారణకాండకు యాకూబ్ సూత్రధారిగా వ్యవహరించినట్లు రుజువు కావడంతో టాడా కోర్టు మరణశిక్ష విధించింది. కిందటేడాది మార్చి నెలలో సుప్రీంకోర్టు కూడా ఆ తీర్పును సమర్థించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన యాకూబ్ సోదరుడు టైగర్ మెమన్ పరారీలో ఉన్నాడు. తాజా పరిణామంతో యాకూబ్‌ని ఉరితీసేందుకు నాగ్‌పూర్ జైలులో మహారాష్ట్ర పోలీస్ శాఖ కసరత్తు ముమ్మరం చేసినట్లు సమాచారం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com