చేతికి పట్టీతో కనిపించడంతో కలవరం…ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేసిన చిరంజీవి
- February 17, 2026
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి చేతికి పట్టీతో కనిపించడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు చక్కర్లు కొట్టగా, ఆయనకు ఏమైనా గాయమైయిందా? రాబోయే ప్రాజెక్టుల పై ప్రభావం ఉంటుందా? అనే చర్చలు మొదలయ్యాయి. అయితే రూమర్స్ కి తావులేకుండా చిరంజీవి స్వయంగా ఎక్స్ (X) వేదికగా స్పందిస్తూ స్పష్టత ఇచ్చారు.
ఎలాంటి పెద్ద ఆరోగ్య సమస్య లేదని, కేవలం చిన్నపాటి షోల్డర్ కీహోల్ సర్జరీ మాత్రమే జరిగిందని స్పష్టం చేశారు మెగాస్టార్. ఇది ముందస్తు జాగ్రత్తగా చేసిన సాధారణ ప్రక్రియ అని, ప్రస్తుతం తాను సాఫీగా కోలుకుంటున్నానని, సర్జరీను విజయవంతంగా నిర్వహించిన ప్రముఖ ఆర్థ్రోస్కోపీ నిపుణుడు డా. నితిన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
“చేతికి పట్టీ ఉండటం గమనించి అభిమానులు, శ్రేయోభిలాషులు నా ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఇది కేవలం చిన్నపాటి షోల్డర్ కీహోల్ సర్జరీ.ప్రస్తుతం నేను కోలుకున్నాను, నా దినచర్య సజావుగా సాగుతోంది.ఈ సర్జరీని ఎంతో నైపుణ్యంతో, సాఫీగా నిర్వహించిన అత్యుత్తమ ఆర్థోస్కోపీ సర్జన్ డాక్టర్ నితిన్ కి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు ❤️. ❤️” అని మెగాస్టార్ తన పోస్ట్ లో తెలిపారు.
రీజినల్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన మన శంకర వర ప్రసాద్ తర్వాత చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు.అలాగే దర్శకుడు బాబీతో మరోసారి చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నారు.
తాజా వార్తలు
- T20WorldCup2026: ఆస్ట్రేలియా ఇంటికే..!
- ఢిల్లీలో AI సమ్మిట్ ప్రారంభం
- కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లు వీళ్లే
- 'రాయల్' ఫోటోగ్రాఫర్ రమేష్ శుక్లాకు షేక్ హమ్దాన్ నివాళి..!!
- ఒమన్ లో పోలీసుల అధికారిక వర్కింగ్ అవర్స్ ఇవే..!!
- సౌదీలో డొమెక్టిక్ వర్కర్స్ తొలగింపునకు అనుమతి..!!
- బహ్రెయిన్ వార్షిక ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఖతార్ లో ఆహార సంస్థల పై నిఘా ముమ్మరం..!!
- రమదాన్..మస్జీదులలో కె-నెట్ పరికరాలపై నిషేధం..!!
- అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కీలక పొలిటికల్ హామీ









