హెల్త్ సెంటర్ల వర్కింగ్ అవర్స్ ప్రకటించిన PHCC..!!
- February 18, 2026
దోహా: ఖతార్ లోని ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సంస్థ (PHCC) పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా తన 31 ఆరోగ్య కేంద్రాల వర్కింగ్ అవర్స్ ను ప్రకటించింది. ఈ కేంద్రాలు ఆదివారం నుండి గురువారం వరకు నిరంతరం తెరిచి ఉంటాయని తెలిపింది. ఇందులో 27 ఆరోగ్య కేంద్రాలు ఉదయం 9 గంటల నుండి అర్ధరాత్రి వరకు నిరంతరం పనిచేస్తాయని PHCC సూచించింది. ఈ కేంద్రాలలో డెంటల్ సేవలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మరియు సాయంత్రం 7 గంటల నుండి అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.
అలాగే, ఆయా సెంటర్లలో వీకెండ్ సేవలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అందిస్తాయని ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సంస్థ పేర్కొంది. అత్యవసర వైద్య సేవలకు సంబంధించి ఫౌండేషన్ 24/7 అత్యవసర కేసు సేవను అందించడానికి 14 ఆరోగ్య కేంద్రాలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. కమ్యూనిటీ కాల్ సెంటర్ 16000 ద్వారా 24 గంటలపాటు మెడికల్ అసిస్టెంట్ ను పొందవచ్చని సూచించింది.
తాజా వార్తలు
- ఔద్ మైథా రోడ్–అల్ అసాయెల్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి
- సెప్టెంబర్ 23న షేక్ మహమ్మద్ లీడర్షిప్ ఫోరం
- స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- షార్జా–ఒమన్ కారిడార్‌లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..







