పాత్రికేయుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కొలుసు పార్థసారధి
- February 18, 2026
విజయవాడ: రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో మీడియా కీలక స్థానం కలిగి ఉందన్నారు. పాత్రికేయులు సమాజానికి దిశానిర్దేశం చేసే శక్తిగా నిలుస్తారని కొనియాడారు. వారి సంక్షేమం, భద్రత, వృత్తి గౌరవం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ డైరీని మంత్రి బుధవారం సచివాలయంలోని తన ఛాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో మీడియా వంతెనలా పనిచేస్తుందని తెలిపారు. బాధ్యతాయుతమైన జర్నలిజం ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తుందని చెప్పారు.
ఈ డైరీకి సంపూర్ణ ప్రాయోజకత్వం అందించిన అన్విత గ్రూప్ చైర్మన్ బొప్పన అచ్చుతరావు, డైరెక్టర్ బొప్పన నాగభూషణంలను మంత్రి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. పాత్రికేయుల కార్యక్రమానికి కార్పొరేట్ సంస్థలు సహకరించడం శుభపరిణామమని, ఇలాంటి సహకారం సమాజానికి మేలు చేస్తుందని పేర్కొన్నారు.యూనియన్ అధ్యక్షుడు చావా రవి, కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు ,ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏచూరి శివ, కోశాధికారి ఏడుకొండలు,యూనియన్ నాయకులు జి. విజయకుమార్, గోపీనాథ్, బొప్పన రవికుమార్, మల్లికార్జునరావు, నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు.ఈ డైరీ పాత్రికేయుల వృత్తి కార్యకలాపాలకు ఎంతో ఉపయోగకరమని మంచి సమాచారం పొందుపరిచారని సభ్యులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఔద్ మైథా రోడ్–అల్ అసాయెల్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి
- సెప్టెంబర్ 23న షేక్ మహమ్మద్ లీడర్షిప్ ఫోరం
- స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- షార్జా–ఒమన్ కారిడార్‌లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..







