ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఆలస్యం..మస్కట్ లో ప్రయాణికుల పాట్లు..!!
- February 18, 2026
మస్కట్: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం IX 164లో మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి న్యూఢిల్లీకి దాదాపు 5 గంటల ఆలస్యంగా బయలుదేరింది. ఈ ఫ్లైట్ లో 125 మందికి పైగా ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి 11.30 గంటలకు మస్కట్ (MCT) నుండి న్యూఢిల్లీ (DEL)కి బయలుదేరాలి. కానీ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నడిపే AI-9234 ఫ్లైట్ "టెక్నికల్ ఇష్యూస్" కారణంగా దాదాపు 5గంటల ఆలస్యంగా మరుసటి రోజు తెల్లవారుజామున 3.50 గంటలకు బయలుదేరింది.
అయితే, న్యూఢిల్లీ నుండి తమ కనెక్టింగ్ విమానాలను మిస్ కావడం పట్ల చాలా మంది ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. చివరి నిమిషంలో టిక్కెట్లు కొనడానికి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉండటం, ముందస్తుగా బుక్ చేసుకున్న ప్రయాణాల వల్ల కలిగే ఆర్థిక నష్టం గురించి ఆందోళన చెందారు.
తాజా వార్తలు
- ఔద్ మైథా రోడ్–అల్ అసాయెల్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి
- సెప్టెంబర్ 23న షేక్ మహమ్మద్ లీడర్షిప్ ఫోరం
- స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- షార్జా–ఒమన్ కారిడార్‌లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..







