మైదాన్ హవల్లీలో అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం..!!

- September 27, 2026 , by Maagulf
మైదాన్ హవల్లీలో అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం..!!

కువైట్:మైదాన్ హవల్లీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఐదో అంతస్తులోని ఓ ఫ్లాట్‌లో మంటలు చెలరేగినట్లు జనరల్ ఫైర్ ఫోర్స్ తెలిపింది. సమాచారం అందుకున్న హవల్లి, సల్మియా సెంట్రల్ ఫైర్‌ఫైటింగ్ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయని పేర్కొంది.
ముందస్తు జాగ్రత్తగా భవనంలోని నివాసితులను ఫైర్‌ఫైటర్లు సురక్షితంగా బయటకు తరలించారని వెల్లడించింది. అనంతరం మంటలను పూర్తిగా ఆర్పివేశారని తెలిపింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని తదుపరి చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించినట్లు జనరల్ ఫైర్ ఫోర్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com