ఈ-స్కూటర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- September 27, 2026
అబుదాబి: ఈ-బైక్‌లు, ఈ-స్కూటర్లను ఉపయోగించే వారు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అబుదాబి పోలీసులు హెచ్చరించారు. ముఖ్యంగా ప్రధాన రహదారులపై ఈ-స్కూటర్లతో ప్రయాణించడం ప్రమాదకరమని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఈ-స్కూటర్లు నడుపుతున్న తీరును చూపిస్తూ పోలీసులు ఓ వీడియోను విడుదల చేశారు.
కొందరు రైడర్లు అనుమతి లేని ప్రాంతాల్లో, ప్రధాన రహదారులపై ఇతర వాహనాల మధ్య నుంచి దూసుకెళ్తూ ప్రయాణిస్తున్నట్లు వీడియోలో చూపించారు. ఇలాంటి చర్యలు రైడర్ల ప్రాణాలకు ప్రమాదం కలిగించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఈ-బైక్‌లు, ఈ-స్కూటర్లను అధికారికంగా నిర్దేశించిన మార్గాలు, ప్రాంతాల్లో మాత్రమే వినియోగించాలని, ప్రధాన రహదారులకు దూరంగా ఉండాలని సూచించారు.
హెల్మెట్ తప్పనిసరి
ప్రమాదాల నివారణ, గాయాల తీవ్రతను తగ్గించేందుకు రైడర్లు హెల్మెట్‌తో పాటు మోకాళ్లు, మోచేతులకు రక్షణ కల్పించే గార్డులు ధరించాలని పోలీసులు సూచించారు. ఇతర భద్రతా నిబంధనలను కూడా తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. పిల్లలు ఈ-బైక్‌లు, ఈ-స్కూటర్లను ప్రమాదకరంగా ఉపయోగించకుండా తల్లిదండ్రులు అవగాహన కల్పించాలని అబుదాబి పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- మైదాన్ హవల్లీలో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- ఈ-స్కూటర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- ఒమన్‌లో ఆరుగురు ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- మక్కాలో కొత్త రోడ్డు లేన్లు ప్రారంభం..90శాతం తగ్గనున్న ప్రయాణ సమయం..!!
- యూఏఈ లాటరీ డ్రా ఫలితాలు.. ముగ్గురికి చెరో Dh50,000..!!
- థాయ్‌లాండ్‌లో ఖతార్ పౌరులకు ఎంబసీ హెచ్చరిక..!!
- కువైట్‌లో 13 ఏళ్ల భారతీయ బాలిక.. జెన్ జెడ్ జీవితంపై తొలి పుస్తకం..!!
- వీల్‌చైర్ వినియోగదారులకు అనుకూలంగా వాక్‌వేలు..!!
- వైరల్ వీడియోల పై ఒమన్ పోలీసులు దర్యాప్తు.. చట్టపరమైన చర్యలకు సిద్ధం
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్







