ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ మెసేజులపై ఖతార్ క్లారిటీ..!!

- February 21, 2026 , by Maagulf
ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ మెసేజులపై ఖతార్ క్లారిటీ..!!

దోహా: ఖతార్ లో మొబైల్ ఫోన్ లలో ముందస్తు హెచ్చరిక మెసేజులపై అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ స్పందించింది. ప్రజా భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడం మరియు జాతీయ హెచ్చరిక విధానాల సంసిద్ధతను నిర్ధారించడంలో భాగంగానే వాటిని పంపినట్లు సోషల్ మీడియా పోస్ట్ లో క్లారిటీ ఇచ్చింది.

ఖతార్ లోని చాలా ప్రాంతాలలో పొగమంచు కారణంగా విజిబిలిటీ తగ్గిందని అందుకు అనుగుణంగా మొబైల్ ఫోన్‌లకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ద్వారా మెసేజులను పంపినట్లు తెలిపింది.  ఎమర్జెన్సీ అలెర్ట్ వ్యవస్థ సామర్థ్యాన్ని పరీక్షించడానికి, హెచ్చరిక స్థాయిలను అంచనా వేయడానికి మరియు రియల్ టైమ్ పరిస్థితులలో మెసేజులను ప్రజలకు వేగంగా సమాచారాన్ని చేరవేయడానికి ప్రయత్నించినట్లు పేర్కొంది. 

ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే తక్షణ హెచ్చరిక సాధనంగా పరిగణించబడుతుందని, దీని ద్వారా ప్రజలు అవసరమైన జాగ్రత్తలు వెంటనే తీసుకోవడానికి వీలుగా అన్ని మొబైల్స్ కు మెసేజులు డెలివరీ అవుతాయని మంత్రిత్వశాఖ తెలిపింది.  ప్రజలు అలాంటి హెచ్చరికలను తీవ్రంగా పరిగణించాలని మరియు వాటిలో ఉన్న సూచనలను పాటించాలని సూచించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com