‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమానికి హాజరైన సీఎం
- February 21, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం పల్నాడు జిల్లా వినుకొండలో పర్యటించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ఆయన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం సిద్ధం చేసిన ‘స్వచ్ఛ రథాన్ని’ ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాళ్లను ఆయన పరిశీలించారు. ఆయా విభాగాల పనితీరును, ప్రజలకు అందుతున్న సేవలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 561 పొదుపు సంఘాలకు రూ.100.14 కోట్ల భారీ రుణాల చెక్కును ముఖ్యమంత్రి అందజేశారు. ఈ నిధులు స్వయం సహాయక సంఘాల బలోపేతానికి, మహిళల ఆర్థిక ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడతాయని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవికుమార్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్, కలెక్టర్ కృతికా శుక్లా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







