భారతీయ విశ్వవిద్యాలయాలు ‘రోబోడాగ్’ నుంచి ఏం నేర్చుకోవాలి: BITS వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు
- February 22, 2026
న్యూఢిల్లీ: భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో ఒక ప్రైవేట్ యూనివర్సిటీ ఎపిసోడ్ అందరిని ఆలోచించేలా చేసింది. ఈ సంఘటనపై బిట్స్ పిలానీ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌కు వైస్ ఛాన్సలర్ మరియు ఐఐటి ఢిల్లీ మాజీ డైరెక్టర్ వి.రాంగోపాల్ రావు స్పందించారు. ఇలాంటి సంఘటన జరగడం బాధాకరమన్నారు. వాస్తవానికి ప్రతి సంస్థలో మంచి విద్యార్థులు, నిబద్ధత కలిగిన ఉపాధ్యాయులు ఉంటారని అన్నారు. తప్పుడు కారణాల వల్ల ఏదైనా వైరల్ అయినప్పుడు, దాని బాధ్యత మొత్తం ఆ సంస్థ యాజమాన్యం మెడకు చూట్టుకుంటుందని తెలిపారు.
వాస్తవానికి రోబో డాగ్ ప్రాజెక్ట్ ను అనుభవం ఉన్నవారే రూపొందించారు. కానీ సోషల్ మీడియా డిఫరెంట్ గా స్పందిస్తుంది. అది వేగంగా వైరల్ కావడంతో జాతీయ ప్రతిష్టకు సంబంధించిన ప్రశ్నగా మారింది. అది చాలా దురదృష్టకరం అని అన్నారు.
అటువంటి సంఘటనలలో ప్రాథమికంగా తప్పు ఏమిటంటే ప్రదర్శన లేదా పేలవంగా నిర్వహించిన వారిదే. ఆప్టిక్స్ కంటెంట్‌పై ఆధిపత్యం చెలాయిస్తున్న రోజులివి. ఒక విద్యాసంస్థ సాంకేతిక నమూనాను వివరించడానికి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌ను పంపదు. డెమో పక్కన నిలబడి ఉన్న వ్యక్తి దానిని రూపొందించిన, నిర్మించిన, కోడ్ చేసిన లేదా ప్రయోగాత్మకంగా ధృవీకరించిన వ్యక్తి అయి ఉండాలి. మార్కెటింగ్ భాష టెక్నికల్ లాంగ్వేజీని ఎప్పటికీ భర్తీ చేయలేదు. ఒక సందర్భంలో ప్రాజెక్ట్ విశ్వసనీయతను దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంటుంది. నేటి ప్రపంచంలో ప్రతి విజటర్ రియల్ టైమ్ వాస్తవాలను చెక్ చేస్తుంటారు. ఇక విద్యా విషయాలలో మార్కెటింగ్ బృందాలకు అధిక స్వేచ్ఛ ప్రమాదకరంగా మారుతోందని అన్నారు.
విశ్వవిద్యాలయాలు బ్రాండింగ్ ఏజెన్సీలు కావని, కమ్యూనికేషన్ విద్యాపరంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఆయా సంస్థల నాయకత్వం బాధ్యత తీసుకోవాలి. పబ్లిక్ డొమైన్ లో వచ్చే చర్చలను కొట్టిపారేయడానికి వీల్లేదు. అవి ఆయా సంస్థల మేధో సమగ్రతను ప్రతిబింబిస్తాయని రాంగోపాల్ రావు పేర్కొన్నారు. నిజంగా, ఏదైనా తప్పు జరిగినప్పుడు, తప్పును అంగీకరించాలని సూచించారు. స్పష్టమైన వివరణ ఇవ్వడం ద్వారా విషయాన్ని నిజాయితిగా విరవించే ప్రయత్నం చేయాలని అన్నారు. కానీ, ఏదో తెలివైన వివరణలు మరియు టెక్నికల్ భాషతో కప్పిపుచ్చలేమని అభిప్రాయపడ్డారు. సంస్థలు జవాబుదారీ తనంగా ఉండటం ద్వారా దీర్ఘకాలికంగా గౌరవాన్ని సంపాదిస్తాయని రాంగోపాల్ రావు తన వ్యాస్తంలో అభిప్రాయపడ్డారు.
సాధారణంగా ఇలాంటి వాదనలను డిఫెన్స్ చేయడానికి పేటెంట్‌ల కోసం ప్రయత్నించడం అనేది సమయంతోపాటు ఖర్చు కూడా అధికంగా ఉంటుందన్నారు. ప్రచురణలకు కూడా ఇదే వర్తిస్తుంది. నాణ్యమైన పరిశోధన ఖరీదైనది. పరికరాలు, పీహెచ్‌డీ ఫెలోషిప్‌లు, పోస్ట్‌డాక్టోరల్ మద్దతు, సమావేశ ప్రయాణం మరియు ప్రచురణ ఖర్చులు అన్నీ ఖర్చుతో కూడుకున్నవే. పేటెంట్‌ల కోసం ఇంకా చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇక్కడ ర్యాంకింగ్ లు ఏమాత్రం ఉపయోగపడవు. అయితే, ఇంకా దేశంలో అనేక సంస్థలు ఇలాంటి మార్గంలో నడుస్తున్నాయని, డబ్బుతో ఏదైనా సాధించవచ్చే అపోహలో కొట్టుమిట్టాడుతున్నారు. అలాంటి వారు ఈ సంఘలన నుండి నేర్చుకోవాలి. ఇలాంటి చర్చలు వచ్చిన సమయంలో సమర్థంగా వాదించగలగాలి. పరిశోధన ఫలితాలను పారదర్శకంగా వెల్లడించాలని పేర్కొన్నారు. ఇది మనందరికీ ఆత్మపరిశీలన చేసుకునే క్షణంగా ఉండాలి. సామర్థ్యాల గురించి నిజాయితీగా, వారి వాదనలలో పారదర్శకంగా మద్దతు ఇవ్వబడిన మార్గాల్లో ప్రతిష్టాత్మకంగా ఉండే సంస్థలను నిర్మించుకుందామని రాంగోపాల్ రావు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్‌లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!
- సౌదీ అరేబియాలో 14,893 మంది బహిష్కరణ..!!
- ట్రాన్సిట్, టూరిజం పాలసీపై సమీక్షకు సన్నాహాలు..!!
- ప్రవాసుల లా సేవల పై కువైట్ బార్ అసోసియేషన్ సీరియస్..!!
- భారతీయ విశ్వవిద్యాలయాలు ‘రోబోడాగ్’ నుంచి ఏం నేర్చుకోవాలి: BITS వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..









