దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- February 22, 2026
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్‌తో జరిగిన మ్యాచులో దక్షిణాఫ్రికా 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. డెవాల్డ్ బ్రేవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్ ధాటిగా ఆడడంతో 187 పరుగులు చేసింది. 188 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత బ్యాటర్లు మొదటి నుంచీ ఏ మాత్రం రాణించలేకపోయారు.
భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్ 0, అభిషేక్ శర్మ 15, తిలక్ వర్మ 1, సూర్యకుమార్ యాదవ్ 18, వాషింగ్టన్ సుందర్ 11, శివం దూబే 42, హార్దిక్ పాండ్యా 18 , రింకూ సింగ్ 0, అర్ష్‌దీప్ సింగ్ 1, వరుణ్ చక్రవర్తి 0, బుమ్రా 0 పరుగులు తీశారు. 111 పరుగుల వద్ద టీమిండియా ఆలౌట్ అయింది.
దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ 4, కేశవ్ మహారాజ్ 3, కార్బిన్ బోష్ 2, మార్క్రమ్ ఒక వికెట్ తీశాడు.
దక్షిణాఫ్రికా బ్యాటర్లలో మార్క్రమ్ 4, క్వింటన్ డికాక్ 6, ర్యాన్ రికెల్టన్ 7, డెవాల్డ్ బ్రేవిస్ 45, డేవిడ్ మిల్లర్ 63, ట్రిస్టన్ స్టబ్స్ 44 (నాటౌట్), మార్కో జాన్సెన్ 2, కార్బిన్ బోష్ 5, కగిసో రబాడా 0 పరుగులు చేశారు.
భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 3, అర్ష్‌దీప్ సింగ్ 2, వరుణ్ చక్రవర్తి, శివం దూబే చెరో వికెట్ పడగొట్టారు.
తాజా వార్తలు
- అమెరికాలో ల్యాండైన జిన్‌పింగ్
- రోడ్డుపై చీపురు పట్టిన పోలీస్ అధికారి.. వీడియో వైరల్..!!
- ఏఐ వినియోగంలో సైబర్ భద్రతపై చర్చించిన నిపుణులు..!!
- కువైట్‌లో 40,660 కిలోల ఫుడ్ ధ్వంసం..!!
- యూఏఈలో డీప్‌ఫేక్ మోసాలపై మహ్రె హెచ్చరిక..!!
- దుక్మ్ ప్రత్యేక ఆర్థిక మండలిలో OMR8.8 బిలియన్లకు పెట్టుబడులు..!!
- దోహాలో 22వ జ్యువెలరీ అండ్ వాచెస్ ఎగ్జిబిషన్‌కు సన్నాహాలు..!!
- సౌదీలో మరో 6 డ్రైవింగ్ స్కూల్స్..!!
- ఏపీలో 4 కొత్త పోలీస్ కమిషనరేట్లు.. కేబినెట్ ఆమోదం..!
- ఖోర్‌ఫక్కాన్ పోర్టును సందర్శించిన భారత కాన్సుల్ జనరల్ డా. విష్ణువర్ధన్ రెడ్డి







