దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!
- February 22, 2026
దుబాయ్: రమదాన్ సీజన్ లో దుబాయ్ లో బెగ్గింగ్ అనేది ఒక నెట్ వర్క్ గా మారుతోంది. బెగ్గింగ్ గురించి పోలీసులు అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. యూఏఈలో బెగ్గింగ్ అనేది నిషేధం. రమదాన్ సమయంలో గల్ఫ్ దేశాలతోపాటు దుబాయ్ బెగ్గింగ్ నెట్ వర్క్ కు అడ్డగా మారుతుందని పోలీసులు హెచ్చరించారు. ఈ క్రమంలో దుబాయ్ పోలీసురలు తాజాగా అరెస్ట్ చేశారు. అతడి వద్ద ఉన్న 20,000 దిర్హామ్‌లను చూసి షాక్ అయ్యారు.
ముఖ్యంగా అతడు పార్కింగ్ స్థలాలు, లగ్జరి కార్ల యజమానులను లక్ష్యంగా చేసుకున్నాడని క్రిమినల్ ఫినామినా డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ అలీ సలేం అల్ షంసి తెలిపారు. బెగ్గర్స్ పట్ల సానుభూతి చూపవద్దని ఈ సందర్భంగా అల్ షంసీ ప్రజలను కోరారు. మస్జీదు ప్రవేశ ద్వారాలు, ఆసుపత్రులు, క్లినిక్‌లు, మార్కెట్లు మరియు వీధుల వద్ద ప్రజలను మోసం చేయడానికి బెగ్గర్స్ రకరకాల కట్టు కథలు చెబుతారని అల్ షంసీ వెల్లడించారు. యూఏఈలో అమల్లో ఉన్న చట్టాల ప్రకారం.. బెగ్గింగ్ చేస్తూ మూడు నెలల వరకు జైలుశిక్ష మరియు 10,000 దిర్హామ్‌ల కంటే తక్కువ కాకుండా జరిమానా విధించవచ్చని తెలిపారు.
దుబాయ్ పోలీస్ స్మార్ట్ అప్లికేషన్లో అందుబాటులో ఉన్న పోలీస్ ఐ సర్వీస్‌ను ఉపయోగించి లేదా అధికారిక ఈ-క్రైమ్ ప్లాట్‌ఫామ్ , 901 టోల్-ఫ్రీ నంబర్ ద్వారా కేసులను నివేదించాలని అల్ షంసీ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్‌లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!
- సౌదీ అరేబియాలో 14,893 మంది బహిష్కరణ..!!
- ట్రాన్సిట్, టూరిజం పాలసీపై సమీక్షకు సన్నాహాలు..!!
- ప్రవాసుల లా సేవల పై కువైట్ బార్ అసోసియేషన్ సీరియస్..!!
- భారతీయ విశ్వవిద్యాలయాలు ‘రోబోడాగ్’ నుంచి ఏం నేర్చుకోవాలి: BITS వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..
- శ్రీశైలంలో అగ్ని ప్రమాదం, భక్తులకు తప్పిన పెను ప్రమాదం









