దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్

- February 22, 2026 , by Maagulf
దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్

 టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్‌తో జరిగిన మ్యాచులో దక్షిణాఫ్రికా 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. డెవాల్డ్ బ్రేవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్ ధాటిగా ఆడడంతో 187 పరుగులు చేసింది. 188 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత బ్యాటర్లు మొదటి నుంచీ ఏ మాత్రం రాణించలేకపోయారు.

భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్ 0, అభిషేక్ శర్మ 15, తిలక్ వర్మ 1, సూర్యకుమార్ యాదవ్ 18, వాషింగ్టన్ సుందర్ 11, శివం దూబే 42, హార్దిక్ పాండ్యా 18 , రింకూ సింగ్ 0, అర్ష్‌దీప్ సింగ్ 1, వరుణ్ చక్రవర్తి 0, బుమ్రా 0 పరుగులు తీశారు. 111 పరుగుల వద్ద టీమిండియా ఆలౌట్ అయింది.

దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ 4, కేశవ్ మహారాజ్ 3, కార్బిన్ బోష్ 2, మార్క్రమ్ ఒక వికెట్ తీశాడు.

దక్షిణాఫ్రికా బ్యాటర్లలో మార్క్రమ్ 4, క్వింటన్ డికాక్ 6, ర్యాన్ రికెల్టన్ 7, డెవాల్డ్ బ్రేవిస్ 45, డేవిడ్ మిల్లర్ 63, ట్రిస్టన్ స్టబ్స్ 44 (నాటౌట్‌), మార్కో జాన్సెన్ 2, కార్బిన్ బోష్ 5, కగిసో రబాడా 0 పరుగులు చేశారు.

భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 3, అర్ష్‌దీప్ సింగ్ 2, వరుణ్ చక్రవర్తి, శివం దూబే చెరో వికెట్ పడగొట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com