బహ్రెయిన్ పడవపై పైరేట్స్ దాడి..!!
- February 23, 2026
మనామాః బహ్రెయిన్ కు చెందని ఓ పడవపై పైరట్స్ దాడి చేశారు. ఆ సమయంలో పడవలో ముగ్గురు సిబ్బంది ఉన్నారు. ఉత్తర సముద్ర సరిహద్దు సమీపంలో బహ్రెయిన్ నౌకను పైరేట్స్ లక్ష్యంగా చేసుకున్నారని బహ్రెయిన్ కోస్ట్ గార్డ్ వెల్లడించింది. సమాచారం అందగానే తక్షణ చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. పైరట్స్ పడవను ఒమన్ ప్రాదేశిక జలాల్లోకి తీసుకెళ్లి అందులోని వస్తువులను చోరీ చేశారని పేర్కొన్నారు. దాదాపు మూడు గంటల తర్వాత పడవను, సిబ్బందిని వదిలేయడంతో వారంతా సురక్షితంగా చేరుకున్నారని పేర్కొంది. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కోస్ట్ గార్డ్ తెలిపింది.
తాజా వార్తలు
- ఏపీలో 4 కొత్త పోలీస్ కమిషనరేట్లు.. కేబినెట్ ఆమోదం..!
- ఖోర్‌ఫక్కాన్ పోర్టును సందర్శించిన భారత కాన్సుల్ జనరల్ డా. విష్ణువర్ధన్ రెడ్డి
- UNGAలో జైశంకర్ వరుస భేటీలు.. AI, అంతరిక్షం, UNSC సంస్కరణల పై చర్చలు
- సౌదీలో తెలుగు ప్రవాసులది ప్రత్యేక ఉత్సాహం..భారత రాయబారి విపుల్
- ఖైరతాబాద్ బడా గణేష్‌ను దర్శించుకున్న డీజీపీ సీవీ ఆనంద్
- భారత్–ఖతార్ సంబంధాల బలోపేతం పై చర్చలు
- 120 మంది కార్మికులకు ఎండ నుంచి రక్షణ పై దుబాయ్ పోలీసుల అవగాహన
- ‘ఇరాన్ ఎప్పటికీ తలవంచదు’..ఐరాసలో అధ్యక్షుడు పెజెష్కియన్
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి సంతాపాలు
- 28న మదురైలో ‘మేనమామ బంగారు ఉంగరం పథకం’ ప్రారంభం







