డెలివరీ బైక్‌లే టార్గెట్..సైడ్‌వాక్ ఉల్లంఘనలపై కొరడా..!!
- February 23, 2026
కువైట్ః ఫుట్ పాత్ లపై పార్కింగ్ లేదా డ్రైవింగ్ చేస్తున్న డెలివరీ మోటార్ బైక్స్ తోపాటు ఇతర వాహనాలను లక్ష్యంగా చేసుకుని క్యాపిటల్ గవర్నరేట్ ట్రాఫిక్ పెట్రోల్ విభాగం ట్రాఫిక్ క్యాంపెయిన్ ను నిర్వహించింది. ఈ సందర్భంగా 120 ట్రాఫిక్ ఉల్లంఘనలను నమోదు చేశామని, 17 ఉల్లంఘనలకు పాల్పడిన బైక్స్ ను ఇంపౌండ్ లాట్‌కు రిఫర్ చేశామని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్‌లోని ట్రాఫిక్ అవేర్‌నెస్ విభాగం డైరెక్టర్ కల్నల్ ఫహ్ద్ అల్-ఎస్సా తెలిపారు. వాకర్స్ భద్రతను కాపాడటం మరియు కాలిబాటలపై ఆక్రమణలను నిరోధించడం, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు మరియు ప్రత్యేక అవసరాలు ఉన్న వ్యక్తులను రక్షించడం ఈ క్యాంపెయిన్ లక్ష్యమని అల్-ఎస్సా చెప్పారు.
ఇటీవల కొంతమంది డెలివరీ బైక్ మరియు ఇతర వాహన డ్రైవర్లు ట్రాఫిక్ రద్దీని తప్పించుకోవడానికి ఫుట్ పాత్ లను ఉపయోగిస్తున్నారని, పాదచారులకు ప్రత్యక్ష ప్రమాదాలను కలిగిస్తున్నారని ఫిర్యాదు అందాయని వెల్లడించారు. దీంతో స్పెషల్ ట్రాఫిక్ వయోలేషన్ డ్రైవ్ నిర్వహించినట్లు ల్నల్ ఫహ్ద్ అల్-ఎస్సా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో 4 కొత్త పోలీస్ కమిషనరేట్లు.. కేబినెట్ ఆమోదం..!
- ఖోర్‌ఫక్కాన్ పోర్టును సందర్శించిన భారత కాన్సుల్ జనరల్ డా. విష్ణువర్ధన్ రెడ్డి
- UNGAలో జైశంకర్ వరుస భేటీలు.. AI, అంతరిక్షం, UNSC సంస్కరణల పై చర్చలు
- సౌదీలో తెలుగు ప్రవాసులది ప్రత్యేక ఉత్సాహం..భారత రాయబారి విపుల్
- ఖైరతాబాద్ బడా గణేష్‌ను దర్శించుకున్న డీజీపీ సీవీ ఆనంద్
- భారత్–ఖతార్ సంబంధాల బలోపేతం పై చర్చలు
- 120 మంది కార్మికులకు ఎండ నుంచి రక్షణ పై దుబాయ్ పోలీసుల అవగాహన
- ‘ఇరాన్ ఎప్పటికీ తలవంచదు’..ఐరాసలో అధ్యక్షుడు పెజెష్కియన్
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి సంతాపాలు
- 28న మదురైలో ‘మేనమామ బంగారు ఉంగరం పథకం’ ప్రారంభం







