కువైట్ సార్వభౌమత్వానికి యూఏఈ మద్దతు..!!
- February 23, 2026
దుబాయ్ః కువైట్‌కు యూఏఈ సంఘీభావాన్ని ప్రకటించింది. కువైట్ సముద్ర ప్రాంతాలపై దాని సార్వభౌమత్వాన్ని సమర్థిస్తుందని పేర్కొంది. దాని సార్వభౌమత్వం లేదా జాతీయ ప్రయోజనాలపై ఏదైనా ఆక్రమణ జరిగినప్పుడు కువైట్‌తో పాటు తన వైఖరిని పునరుద్ఘాటిస్తుందని స్పష్టం చేసింది.
ఇరాక్ ఐక్యరాజ్యసమితితో దాఖలు చేసిన కోఆర్డినేట్ల జాబితా మరియు మ్యాప్, అల్-ఖుద్రా షోల్స్ మరియు అల్-అయిజ్ షోల్స్‌తో సహా దాని ప్రాంతాలు మరియు ప్రాదేశిక జలాలపై కువైట్ హక్కులకు భంగం కలిగించడాన్ని యూఏఈ తప్పుబట్టింది. రెండు దేశాలు తమ మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను పరిగణనలోకి తీసుకుని, ఈ సమస్యను బాధ్యతాయుతంగా పరిష్కరించుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో సూచించింది.
1982 సముద్ర చట్టంపై ఐక్యరాజ్యసమితి నిబంధనలకు అనుగుణంగా ద్వైపాక్షిక అవగాహనలు, ఒప్పందాలు ఉండాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ప్రాంతంలో శాంతిని సంరక్షించేలా నిర్మాణాత్మకంగా దౌత్య మార్గాల ద్వారా సంబంధిత సమస్యలను పరిష్కరించుకోవాలని యూఏఈ మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- 120 మంది కార్మికులకు ఎండ నుంచి రక్షణ పై దుబాయ్ పోలీసుల అవగాహన
- ‘ఇరాన్ ఎప్పటికీ తలవంచదు’..ఐరాసలో అధ్యక్షుడు పెజెష్కియన్
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి సంతాపాలు
- 28న మదురైలో ‘మేనమామ బంగారు ఉంగరం పథకం’ ప్రారంభం
- సీఎం రేవంత్ కి కవిత నెల రోజుల డెడ్‌లైన్
- ‘ఇంటి వద్దకే మీ సేవ’ సర్వీసులు.. ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు..
- భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి నేరుగా విమానాలు: కేంద్ర మంత్రి
- భారత్ వైపు వస్తున్న నౌక పై దాడి.. భారతీయుడు మృతి
- బ్యాంక్ మెల్లీ ఇరాన్ పై UAE సెంట్రల్ బ్యాంక్ కఠిన చర్యలు
- అమరావతిలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన







