40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- February 25, 2026
రియాద్ః సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) 16 ఇతర దేశాలలోని నిర్దిష్ట ప్రావిన్సులు మరియు నగరాలను కవర్ చేసే పాక్షిక నిషేధంతో పాటు, 40 దేశాల నుండి చికెన్ మరియు గుడ్ల దిగుమతులపై పూర్తి నిషేధం విధించింది. ప్రపంచ ఆరోగ్య పరిణామాలకు అనుగుణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు అథారిటీ తెలిపింది. ముఖ్యంగా ఏవియన్ ఇన్ ప్టూయెంజా వ్యాప్తిస్తుందని హెచ్చరించింది.
నిషేధం ఎదుర్కొంటున్న దేశాలలో ఆఫ్ఘనిస్తాన్, అజర్‌బైజాన్, జర్మనీ, ఇండోనేషియా, ఇరాన్, బోస్నియా మరియు హెర్జెగోవినా, బల్గేరియా, బంగ్లాదేశ్, తైవాన్, జిబౌటి, దక్షిణాఫ్రికా, చైనా, ఇరాక్, ఘనా, పాలస్తీనా, వియత్నాం, కంబోడియా, కజాఖ్స్తాన్, కామెరూన్, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, లావోస్, లిబియా, మయన్మార్, యునైటెడ్ కింగ్‌డమ్, ఈజిప్ట్, మెక్సికో, మంగోలియా, నేపాల్, నైజర్, నైజీరియా, భారతదేశం, హాంకాంగ్, జపాన్, బుర్కినా ఫాసో, సూడాన్, సెర్బియా, స్లోవేనియా, ఐవరీ కోస్ట్ మరియు మోంటెనెగ్రో దేశాలు ఉన్నాయి.
అలాగే, ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్, ఇటలీ, బెల్జియం, భూటాన్, పోలాండ్, టోగో, డెన్మార్క్, రొమేనియా, జింబాబ్వే, ఫ్రాన్స్, ఫిలిప్పీన్స్, కెనడా, మలేషియా, ఆస్ట్రియా మరియు డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో వంటి 16 దేశాలలోని కొన్ని ప్రావిన్సులు మరియు నగరాల నుంచి దిగుమతిపై పాక్షిక నిషేధం ఉంది.
తాజా వార్తలు
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- 'వాహన్' పోర్టల్‌లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?









