జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!

- February 25, 2026 , by Maagulf
జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!

కువైట్ః 2026 జాతీయ దినోత్సవ వేడుకలకు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సన్నాహాలు వేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఉన్నత స్థాయి భద్రతా సమావేశానికి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ అబ్దుల్వహాబ్ అల్-వుహైబ్ అధ్యక్షత సమావేశం జరిగింది. భద్రతా సిబ్బంది పూర్తిగా సిద్ధంగా ఉన్నారని మరియు వారి విధులను నిర్వర్తించేటప్పుడు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మేజర్ జనరల్ అల్-వుహైబ్ సూచించారు. చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని మరియు వేడుకల సమయంలో ప్రజా క్రమాన్ని దెబ్బతీసే ప్రతికూల పద్ధతులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే సమయంలో, భద్రతా సిబ్బంది ప్రజలతో గౌరవంగా వ్యవహరించాలని, వృద్ధులకు మరియు ప్రత్యేక అవసరాలు ఉన్నవారికి సహాయం అందించాలని ఆయన పిలుపునిచ్చారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com