11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!

- February 25, 2026 , by Maagulf
11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!

యూఏఈః  జైపూర్ నుండి దుబాయ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం దాదాపు 11 గంటలు ఆలస్యం తర్వాత సర్వీస్ ను రద్దు చేశారు. దీనితో ప్రయాణికులు విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు. జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి భారత కాలమానం ప్రకారం ఉదయం 9.40 గంటలకు దుబాయ్‌కు బయలుదేరాల్సి ఉంది.  అయితే, ఫ్లైట్ రాడార్ తో సహా వివిధ విమాన ట్రాకింగ్ వెబ్‌సైట్‌లు విమానం రద్దు అయినట్లు తెలిపాయి.  
ఉదయం ఎయిర్ పోర్టుకు చేరుకున్నానని, రోజంతా విమానాశ్రయంలోనే గడిపినట్లు బాధిత ప్రయాణీకులలో ఒకరైన అంకుర్ చెప్పారు.  చాలా మంది ప్రయాణికులు  గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చిందని, కొంతమంది టెర్మినల్ భవనం వెలుపల నిలబడి ఉన్నారని పేర్కొన్నారు. వృద్ధులు, మహిళలు మరియు పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com