ఒమన్‌లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!

- February 25, 2026 , by Maagulf
ఒమన్‌లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!

మస్కట్: ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ (FSA)  ప్రాథమిక డేటా ప్రకారం, ఇన్సూరెన్స్ సంస్థలు 2025లో దాదాపు 75,300 ట్రాఫిక్ ప్రమాదాలను నమోదు చేశాయి. 2024లో ఇవి 75,200గా ఉన్నాయి.  వీటిలో 54,271 చిన్న ప్రమాదాలు,  20,993 తీవ్రమైన ప్రమాదాలు ఉన్నాయి. తీవ్రమైన ప్రమాదాలు 13.2 శాతం పెరిగాయి.

2025లో ట్రాఫిక్ ప్రమాదాల క్లెయిమ్‌ల సంఖ్య 77,000 దాటిందని డేటా తెలిపింది. 2024లో 76,500 క్లెయిమ్‌లతో పోలిస్తే ఇది 1 శాతం పెరుగుదలను నమోదైంది. చిన్న ప్రమాదాలకు సంబంధించిన క్లెయిమ్‌లు 54,000 కు తగ్గాయి. మరోవైపు, భౌతిక నష్టాన్ని మాత్రమే కలిగించే తీవ్రమైన ప్రమాదాలకు సంబంధించిన క్లెయిమ్‌లు దాదాపు 11,000కి పెరిగాయి.  ఇది 2024లో 9,900 ఉండగా ఏడాదిలో 10 శాతం పెరిగింది. గాయాలు మరియు వైద్య ఖర్చులతో కూడిన తీవ్రమైన ప్రమాదాలకు సంబంధించిన క్లెయిమ్‌లు దాదాపు 12,000కి చేరుకున్నాయి. గత సంవత్సరం 10,000తో పోలిస్తే ఇది 17 శాతం పెరిగింది. అయితే డెత్ క్లెయిమ్‌లు మొత్తం 342గా ఉంది.  

2025లో మొత్తం పరిహారం 79.8 మిలియన్లు దాటింది. చిన్న ప్రమాదాలకు OMR 34.04 మిలియన్లు, భౌతిక నష్టంతో కూడిన తీవ్రమైన ప్రమాదాలకు OMR 18.88 మిలియన్లు,  తీవ్రమైన ప్రమాదాలకు సంబంధించి OMR 22.47 మిలియన్లకు పైగా పెరగగా.. పరిహారం 4.45 మిలియన్లకు తగ్గిందని ప్రైమరీ డేటాలో వివరించారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com