నగరమంతటా బోనాల సందడి
- July 31, 2016
నగరమంతటా బోనాల సందడి నెలకొంది. ఆషాడం మూడో ఆదివారం కావడంతో దాదాపు అన్ని ప్రాంతాల్లో బోనాల సందడే కనిపిస్తోంది. పలు దేవాలయాల్లో బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. కొందరు భక్తులు అమ్మవారికి కల్లు, బెల్లం పానకాన్ని సమర్పించి ముక్కులు తీర్చుకుంటున్నారు. మల్కాజ్గిరి, నేరెడ్మెట్, రసూల్‌పురా, పంజాగుట్లు, మెహీదీపట్నంలోని పలు ఆలయాల్లో బోనాలు ఉత్సావాలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా పాలబస్తీలోని లాల్‌దర్వాజలో సింహవాహిని అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. నగరం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకొని ముక్కులు తీర్చుకుంటున్నారు. ప్రత్యేకంగా అలంకరించిన బోనంలో పెరుగన్నం, దాంతో పాటుగా బెల్లంతో చేసిన అన్నాన్ని ఉంచి అమ్మవారికి సమర్పిస్తారు.చలువ చేయాలంటూ అమ్మవారికి బోనం సమర్పించి భక్తులు ముక్కులు చెల్లించుకుంటారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







