దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!

- February 26, 2026 , by Maagulf
దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!

మస్కట్: సౌత్ అల్ బటినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ కు చెందిన పోలీసులు ఒక అరబ్ జాతీయుడిని అరెస్టు చేశారు. నిందితుడు ఒక వాణిజ్య సంస్థలోని ఉద్యోగిని లక్ష్యంగా చేసుకుని,  అధిక విలువ గల బ్యాంకు నోటును అందజేస్తున్నట్లు నటించి, ఆపై మోసం చేశాడని కేసు నమోదు చేశారు.  నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

మరోకేసుకు సంబందించి, అల్ బురైమిలో దొంగతనం కేసులో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్మాణ సామగ్రి కి సంబంధించిన దుకాణాల నుండి డబ్బును దొంగిలించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని  అరెస్టు చేసినట్లు ఒమన్ రాయల్ పోలీసులు తెలిపారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com