బ్యాడ్మింటన్ గేమ్‌ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!

- February 26, 2026 , by Maagulf
బ్యాడ్మింటన్ గేమ్‌ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!

కువైట్: భారత్ లోని తిరువల్లలోని వలంజవట్టంకు చెందిన భారతీయ ప్రవాసుడు బిబిన్ వి. మథాయ్ కువైట్‌లో మరణించారు. ఆయన వయస్సు 44 సంవత్సరాలు.అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం..బిబిన్ బాట్మింటన్ గేమ్‌ ఆడుతుండగా..  అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు.వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, స్నేహితులు ఫర్వానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు గుండెపోటుతో చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. .

బిబిన్ అల్ ముల్లా బెహ్బెహాని మోటార్ కంపెనీ ఉద్యోగి.ఆయన కువైట్ సెయింట్ గ్రెగోరియోస్ ఆర్థోడాక్స్ మహా పారిష్‌లో యాక్టివ్ మెంబర్.ఆయనకు భార్య బీనా మరియు పిల్లలు డెమోస్, డేవిస్ మరియు డెన్నిస్ ఉన్నారు.

అంత్యక్రియలు తరువాత కేరళలోని వలంజవట్టం,సెయింట్ మేరీస్ ఆర్థోడాక్స్ చర్చిలో జరుగుతాయి.మృతదేహాన్ని భారతదేశానికి తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com