సల్మాబాద్‌లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!

- February 26, 2026 , by Maagulf
సల్మాబాద్‌లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!

మనామా: సల్మాబాద్ గ్యారేజీలో దోపిడీలో పాల్గొన్న ఐదుగురు వ్యక్తులకు ఐదు సంవత్సరాల జైలు శిక్షను హై క్రిమినల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ నిర్ధారించింది. ఒక ఆసియా వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని, ఈ ముఠా ఒక నిందితుడి ఇంట్లో చోరీకి పాల్పడిందని కోర్టు ఫైల్స్ తెలిపింది.

ముగ్గురు వ్యక్తులు రాత్రిపూట పోలీసులమని చెప్పి బాధితుడి గ్యారేజీలోకి ప్రవేశించి, బాధితులపై దాడి చేసి, ఫోన్లు, టాబ్లెట్, నగదు, ఇతర విలువైన సామగ్రిని దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించి పట్టుకున్నారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com