అబుదాబి బిగ్ టికెట్: ఇండియా, బంగ్లాదేశ్ నుంచి నలుగురు విజేతలు..!!
- February 27, 2026
యూఏఈః బిగ్ టికెట్ అబుదాబి తన మూడవ ఫిబ్రవరి వీక్లీ ఇ-డ్రాను నిర్వహించింది. ఇందులో ఇండియా, బంగ్లాదేశ్ లకు చెందిన నలుగురు విజేతలుగా నిలిచారు. ప్రతి విజేతకు Dh50,000 లభించింది. విజేతలలో భారతదేశానికి చెందిన గోపకుమార్ దివాకరన్ పిళ్లై ఆన్ లైన్ లో టికెట్ కొనుగోలు చేసి విజేతగా నిలిచారు.మరో విజేత అయిన హైదరాబాద్‌కు చెందిన షార్జా నివాసి సంధ్యా ప్రదీప్ తన గ్రూపులోని 20 మందితో బహుమతిని పంచుకోనున్నట్లు తెలిపారు.
ఇక 1987 నుండి అజ్మాన్‌లో నివసిస్తున్న 55 ఏళ్ల బంగ్లాదేశ్ ప్రవాసుడు మొహమ్మద్ రాణా సురుజ్‌జామాన్ విజేతగా నిలిచాడు. అలాగే, అల్ ఐన్‌లో నివసిస్తున్న బంగ్లాదేశ్‌కు చెందిన 29 ఏళ్ల MD జమిల్ హొస్సేన్ మరో విజేతగా నిలిచాడు. బహుమతిని 14 మంది స్నేహితులతో పంచుకుంటానన్న జమిల్.. బిగ్ టికెట్ డ్రాల్లోకి పాల్గొనడం కొనసాగించాలని యోచిస్తున్నట్లు చెప్పాడు. కాగా, మార్చి 3న 15 మిలియన్ల దిర్హామ్‌ల గ్రాండ్ ప్రైజ్ డ్రాను లైవ్ లో నిర్వహించనున్నారు. ఈ గ్రాండ్ ప్రైజ్‌తో పాటు ఐదు కన్సోలేషన్ బహుమతుల కింద ఒక్కొక్కరికి 100,000 దిర్హామ్‌ల చొప్పున అందజేయనున్నా తెలిపారు.
తాజా వార్తలు
- ఇంట్లోకి చొరబడి కాల్పులు, 11 మంది మృతి
- ఆసియా-పసిఫిక్‌లో ఏరో ఇంజిన్ సేవల విస్తరణకు జీఎంఆర్ ఏరో టెక్నిక్–స్టాండర్డ్ ఏరో భాగస్వామ్యం
- యూపీఐ ఛార్జీలపై NPCI కీలక ప్రకటన
- దుబాయ్‌లో పెయిడ్ కార్ లిఫ్ట్‌లపై ఆర్టీఏ హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా
- దుబాయ్‌లో ఇళ్ల కొనుగోలుపై UBS ఆసక్తికర నివేదిక..!!
- కువైట్‌లో అత్యవసర ప్రణాళికలపై ఫైర్‌ఫోర్స్ సమీక్ష..!!
- ఖతార్‌లో డ్రైవింగ్ లైసెన్స్: అర్హతలు, నిబంధనలు, ఫీజుల పూర్తి వివరాలు..!!
- ప్రపంచ ముస్లింల మనోభావాలను హౌతీ దెబ్బతీస్తోంది..!!
- హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ..ఫ్రాన్స్‌తో జీసీసీ కీలక చర్చలు..!!
- మస్కట్‌లో రోడ్ల అభివృద్ధికి భారీగా పనులు..భద్రత బలోపేతం..!!







